అకృత్యం.. నిత్యకృత్యం

ABN , First Publish Date - 2023-07-26T03:20:25+05:30 IST

ఆమె సాధారణ మహిళ.. మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌ పశ్చిమ జిల్లాలోని సూపర్‌ మార్కెట్‌లో షాపింగ్‌కు వెళ్లింది.

అకృత్యం.. నిత్యకృత్యం

ఆమె సాధారణ మహిళ.. మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌ పశ్చిమ జిల్లాలోని సూపర్‌ మార్కెట్‌లో షాపింగ్‌కు వెళ్లింది. అక్కడే ఉన్న బీఎ్‌సఎఫ్‌ జవాను ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. మహిళ భుజం మీద చేయి వేసి.. దుర్భాషలాడుతూ వేధించాడు. మణిపూర్‌లో ముగ్గురు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన ఈ నెల 19న వెలుగులోకి రాగా.. మరుసటి రోజే ఈ ఉదంతం జరగడం గమనార్హం. సైనిక దుస్తుల్లో ఇన్సాస్‌ రైఫిల్‌తో ఉన్నది బీఎస్‌ఎఫ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ సతీష్‌ ప్రసాద్‌గా తేలింది. అతడిని సస్పెండ్‌ చేయడమే కాక కేసు నమోదు చేసి.. కదలికలపై బీఎ్‌సఎఫ్‌ ఆంక్షలు విధించింది.

Updated Date - 2023-07-26T03:20:25+05:30 IST