వీధి కుక్కల బెడదపై సుప్రీంలో చర్చ

ABN , First Publish Date - 2023-09-12T02:33:40+05:30 IST

వీధి కుక్కల బెడద సోమవారం సుప్రీంకోర్టులో చర్చకు వచ్చింది. సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ ధర్మాసనంలో విచారణ సందర్భంగా ఒక న్యాయవాది భుజానికి కట్టు కట్టుకొని వచ్చిన విషయాన్ని సీజే గమనించారు.

వీధి కుక్కల బెడదపై సుప్రీంలో చర్చ

వీధి కుక్కల బెడద సోమవారం సుప్రీంకోర్టులో చర్చకు వచ్చింది. సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ ధర్మాసనంలో విచారణ సందర్భంగా ఒక న్యాయవాది భుజానికి కట్టు కట్టుకొని వచ్చిన విషయాన్ని సీజే గమనించారు. ఏమైందని అడిగారు. ఐదు వీధి కుక్కలు తనను వెంబడించాయని చెప్పారు. ఈ సందర్భంగా జస్టిస్‌ చంద్రచూడ్‌ కూడా తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకొన్నారు. రెండేళ్ల క్రితం తన వ్యక్తిగత సహాయకుడు కారు పార్క్‌ చేస్తుండగా వీధి కుక్కలు దాడి చేశాయని చెప్పారు. యూపీలో ఇటీవల వీధికుక్కలు చిన్నారి ప్రాణం తీసిన విషయాన్ని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా సీజే దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందిస్తూ.. వీధి కుక్కల సమస్యపై తామేం చేయగలమో ఆలోచిస్తామని సీజే చంద్రచూడ్‌ అన్నారు.

Updated Date - 2023-09-12T02:33:40+05:30 IST