Share News

ISRO: భూకక్ష్యలోకి చంద్రయాన్ - 3 ప్రొపల్షన్ మాడ్యూల్.. ఇస్రోకి అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ

ABN , First Publish Date - 2023-12-07T12:26:49+05:30 IST

చంద్రుడి(Moon) దక్షిణ ధ్రువంపై పరిశోధనలే ధ్యేయంగా భారత్ ప్రవేశపెట్టిన చంద్రయాన్ - 3(Chandrayaan-3) విషయంలో ఇస్రో మరో రికార్డు క్రియేట్ చేసింది.

ISRO: భూకక్ష్యలోకి చంద్రయాన్ - 3 ప్రొపల్షన్ మాడ్యూల్.. ఇస్రోకి అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ

ఢిల్లీ: చంద్రుడి(Moon) దక్షిణ ధ్రువంపై పరిశోధనలే ధ్యేయంగా భారత్ ప్రవేశపెట్టిన చంద్రయాన్ - 3(Chandrayaan-3) విషయంలో ఇస్రో మరో రికార్డు క్రియేట్ చేసింది. చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ప్రొపల్షన్ మాడ్యూల్(Propulsion Module)ని విజయవంతంగా మళ్లీ భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. అయితే ఈ ప్రయోగాన్ని మొదట అనుకోలేదని ఇస్రో సైంటిస్టులు తెలిపారు.

చంద్రుడి ఉపరితలంపై ప్రయోగాలకోసం పంపిన ఈ మూన్ మిషన్ తాజా రికార్డు మరింత లోతుగా ప్రయోగాలు చేయడానికి ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. జాబిల్లిపై నమూనాలు సేకరించి అక్కడ నుంచి తిరిగి వచ్చే మిషన్ కోసం ప్రణాళికలు రూపొందించేందుకు ప్రొపల్షన్ మాడ్యూల్లోని అదనపు సమాచారం ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

ఈ ఏడాది జులై 14న శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి చంద్రయాన్-3 మిషన్‌ను ఇస్రో ప్రయోగించింది. అది విజయవంతం కావడంతో ప్రొపల్షన్ మాడ్యుల్, ల్యాండింగ్ మాడ్యుల్‌ వేరయ్యాయి. ఆగస్టు 23న జాబిల్లిపై ల్యాండర్ విజయవంతంగా దిగింది. ల్యాండింగ్ మాడ్యుల్‌లోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌ అక్కడ 15 రోజులు పరిశోధనలు కొనసాగించి తరువాత నిద్రాణ స్థితిలోకి చేరుకున్నాయి.


ఇస్రోకి ప్రధాని ప్రశంసలు..

చంద్రయాన్ -3 తాజా విజయం పట్ల ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. ఇస్రో సైంటిస్టులు తాజాగా మరో మైలురాయిని చేరుకోవడం అభినందించదగిన విషయమని పేర్కొన్నారు.

భవిష్యత్తు అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో మరో సాంకేతిక మైలురాయిని అందుకుందన్నారు. 2040 నాటికి చంద్రుడిపైకి మనుషుల్ని పంపాలనే లక్ష్యంతో సైంటిస్టులు పని చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2023-12-07T12:26:52+05:30 IST