Covid 19: దేశంలో కొత్తగా 594 కరోనా కేసులు.. కేరళలోనే అత్యధికం
ABN , Publish Date - Dec 21 , 2023 | 02:53 PM
దేశ వ్యాప్తంగా కరోనా కేసుల(Corona Cases) సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. గురువారం ఉదయం 8 గంటల వరకు దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 594గా ఉంది.
ఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా కేసుల(Corona Cases) సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. గురువారం ఉదయం 8 గంటల వరకు దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 594గా ఉంది. ఇందులో 300 కేసులు కేరళలోనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కేరళలో ముగ్గురు మృతి చెందారు. వీటిలో 21 కేసులు జేఎన్ 1కి చెందినవి. దేశ వ్యాప్తంగా మొత్తంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలో ఆరు కేసులు నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ లో ఒక కేసు నమోదైంది. ప్రస్తుతం దేశంలో 2,669 యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ మాట్లాడుతూ.. "కేరళలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. వైరస్ ని అడ్డుకునేందుకు ఆసుపత్రులు సిద్ధం చేశాం. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు" అని అన్నారు. వ్యాధి సోకినవారికి జలుబు తీవ్రంగా ఉంటుంది. విపరీతమైన దగ్గు, ఆయాసం వస్తుంది. జ్వరంతో ఈ లక్షణాలు మొదలవుతాయి. గొంతు మారుతుంది. న్యుమోనియా తరహా లక్షణాలు కనిపిస్తాయి.
అలర్ట్ అయిన కేంద్ర ప్రభుత్వం...
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నందునా కేంద్ర ప్రభుత్వం కట్టడి చర్యలు చేపట్టింది. జేఎన్ 1(JN 1) వేరియంట్ కేసుల వ్యాప్తి తెలిసేలా హెల్త్ వెబ్ సైట్ లో ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయాలని సూచించింది. అయితే ఈ వేరియంట్ ప్రమాదకరమైందేమీ కాదని.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ప్రజలు మాస్క్ లు ధరిస్తూ.. ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవాలని సూచించింది.
"మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి"