Miss India 2023: మిస్ ఇండియా 2023గా నందిని గుప్తా
ABN , First Publish Date - 2023-04-16T16:02:27+05:30 IST
ఫెమినా మిస్ ఇండియా 2023(Miss India 2023) కిరీటాన్ని రాజస్థాన్(Rajasthan)కు చెందిన 19 ఏళ్ల ..
ఫెమినా మిస్ ఇండియా 2023(Miss India 2023) కిరీటాన్ని రాజస్థాన్(Rajasthan)కు చెందిన 19 ఏళ్ల నందిని గుప్తా గెలుచుకుంది. మొదటి రన్నరప్‌గా ఢిల్లీ(Delhi)కి చెందిన శ్రేయా పూంజ(Shreya Poonja), రెండో రన్నరప్‌గా మణిపూర్(Manipu)కు చెందిన తౌనోజామ్ స్ట్రెలా లువాంగ్ (Thounaojam Strela Luwang) నిలిచారు. వివిధ రాష్ట్రాలనుంచి మొత్తం 30 మంది కంటెస్టెంట్లు పాల్గొనగా ఈ ముగ్గురు మొదటి మూడు స్థానాల్లో ఎంపికయ్యారు.
మాజీ ఫెమినా మిస్ ఇండియా 2022 విజేత(Femina Miss India 2022 winner) సినీ శెట్టి(Sini Shetty) నుంచి నందిని కిరీటాన్ని ధరించారు. అలాగే రాజస్థాన్‌కు చెందిన మాజీ మిస్ ఇండియా 1వ, 2వ రన్నరప్ రూబల్ షెకావత్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన షినతా చౌహాన్లు వరుసగా శ్రేయా, తౌనోజామ్లకు కిరీటం ధరింపజేశారు.