Google: 30 రోజుల్లో రూ.1337 కోట్ల జరిమానా కట్టాలని గూగుల్‌కు ఆదేశాలు... చేసిన తప్పేంటంటే...
ABN , First Publish Date - 2023-03-29T17:57:40+05:30 IST
కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) విధించిన రూ.1,337.76 కోట్ల జరిమానాను 30 రోజుల్లోగా
న్యూఢిల్లీ : కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) విధించిన రూ.1,337.76 కోట్ల జరిమానాను 30 రోజుల్లోగా చెల్లించాలని నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రైబ్యునల్ (NCLAT) బుధవారం తీర్పు చెప్పింది. అనుచిత వ్యాపార కార్యకలాపాలకు పాల్పడవద్దని కూడా ఆదేశించింది. ఆండ్రాయిడ్ మొబైల్ డివైసెస్ విషయంలో పోటీ నిరోధక చర్యలకు పాల్పడినందుకు గత ఏడాది అక్టోబరు 20న సీసీఐ ఈ జరిమానాను విధించింది.
సీసీఐ ఆదేశాలను సవాల్ చేస్తూ గూగుల్ దాఖలు చేసిన పిటిషన్‌పై NCLAT ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపి బుధవారం తీర్పు చెప్పింది. సీసీఐ నిర్వహించిన దర్యాప్తులో సహజ న్యాయ సూత్రాల ఉల్లంఘన జరగలేదని స్పష్టం చేసింది. జరిమానాను 30 రోజుల్లోగా అమలు చేయాలని తెలిపింది.
ఇవి కూడా చదవండి :
India Vs China : ఎస్‌సీఓ సదస్సులో చైనాకు భారత్ షాక్!
UPI Transactions : డిజిటల్ పేమెంట్లపై ఛార్జీలా? అమ్మో!