సుప్రీంకోర్టులో కొత్తగా ‘సంజ్ఞల భాష’!
ABN , First Publish Date - 2023-09-26T01:46:33+05:30 IST
సమాన అవకాశాల కల్పన అంటే ఏమిటో సుప్రీంకోర్టు ప్రత్యక్షంగా అమలుచేసి చూపించింది...
న్యూఢిల్లీ, సెప్టెంబరు 25: సమాన అవకాశాల కల్పన అంటే ఏమిటో సుప్రీంకోర్టు ప్రత్యక్షంగా అమలుచేసి చూపించింది. కొత్తగా సంజ్ఞల భాషకు చోటిచ్చింది. తొలిసారిగా మూగ, బఽధిర లక్షణాలతో విభిన్న సామర్థ్యం కలిగిన న్యాయవాదికి కేసు వాదించే అవకాశం కలిగించింది. ఆ న్యాయవాది మహిళ కావడం విశేషం. సంజ్ఞల భాషలో ఆమె వాదించగా, దానిని ఇంటర్‌ప్రెటర్ తర్జుమా చేసి ధర్మాసనానికి వినిపించారు. ఓ కేసుపై వర్చువల్ విధానంలో వాదనలు వినిపించేందుకు విభిన్న నైపుణ్యంగల న్యాయవాది సారా సన్నీకి సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ అవాశం కల్పించారు. ఆమె సంజ్ఞల భాషలో చేసే వాదనలను తర్జుమా చేసేందుకు సుభాష్ రాయ్‌చౌధరి ఇంటర్పెటర్‌గా వ్యవహరించారు. సుప్రీంకోర్టు ఆదివారం ఇతర కార్యక్రమాల విషయంలో కూడా తొలిసారిగా సంజ్ఞల భాషను ఉపయోగించింది.