Padma Awards 2023: కన్నుల పండువగా పద్మ పురస్కారాల ప్రదానోత్సవం

ABN , First Publish Date - 2023-04-05T20:25:26+05:30 IST

రాష్టప్రతిభవన్లో పద్మ పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ అవార్డులు అందజేశారు.

Padma Awards 2023: కన్నుల పండువగా పద్మ పురస్కారాల ప్రదానోత్సవం
Padma Awards 2023

ఢిల్లీ: రాష్టప్రతిభవన్లో పద్మ పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu ) 2023 పద్మ అవార్డులు ( Padma Awards 2023) అందజేశారు. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్ యాదవ్‌కు (Late Samajwadi Party patron Mulayam Singh Yadav) మరణానంతరం (posthumously) ప్రకటించిన పద్మవిభూషణ్ (Padma Vibhushan ) అవార్డును ఆయన తనయుడు అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) అందుకున్నారు.

ఆధ్యాత్మిక రంగంలో సేవలకుగాను చిన్నజీయర్ స్వామికి (Tridandi Chinna Jeeyar Swami) పద్మభూషణ్ ( Padma Bhushan) అవార్డు బహూకరించారు. సామాజిక సేవలో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి (Sudha Murty) పద్మ భూషణ్ అవార్డును అందుకున్నారు.

సైన్స్ ఇంజినీరింగ్ విభాగంలో మిల్లెట్ మ్యాన్ ఖాదర్వలీ(Dr Khadar Valli Dudekula), కళారంగంలో సేవలకు గాను సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి (Marakathamani Keeravaani), విజ్ఞానరంగంలో ప్రొఫెసర్ నాగప్ప గణేష్, విజ్ఞానరంగంలో అబ్బారెడ్డి రాజేశ్వర్రెడ్డి, కళారంగంలో రవీనా టాండన్ పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు.

Updated Date - 2023-04-05T21:50:28+05:30 IST