Rajasthan Minister: చంద్రయాన్-3 సక్సెస్‌పై వ్యాఖ్యానించి నవ్వులపాలైన మంత్రి.. ఏమన్నారో తెలిస్తే నవ్వాగదు..!

ABN , First Publish Date - 2023-08-23T22:45:26+05:30 IST

చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి ల్యాండర్ మనదే కావడంతో ప్రపంచ దేశాలన్నీ ‘జయహో భారత్’ అని వేనోళ్లా కీర్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే చంద్రయాన్-3 ప్రయోగం గురించి ప్రశంసించబోయి రాజస్థాన్‌కు చెందిన క్రీడా శాఖా మంత్రి అశోక్ చంద్నా పరువు పోగొట్టుకున్నారు.

Rajasthan Minister: చంద్రయాన్-3 సక్సెస్‌పై వ్యాఖ్యానించి నవ్వులపాలైన మంత్రి.. ఏమన్నారో తెలిస్తే నవ్వాగదు..!

చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి ల్యాండర్ మనదే కావడంతో ప్రపంచ దేశాలన్నీ ‘జయహో భారత్’ అని వేనోళ్లా కీర్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే చంద్రయాన్-3 ప్రయోగం గురించి ప్రశంసించబోయి రాజస్థాన్‌కు చెందిన క్రీడా శాఖా మంత్రి అశోక్ చంద్నా పరువు పోగొట్టుకున్నారు. ‘‘చంద్రుడిపైకి వెళ్లిన ప్రయాణికులందరికీ హ్యాట్సాఫ్’’ అని ఆయన చేసిన వ్యాఖ్యలు అభాసుపాలయ్యాయి. ఎందుకంటే.. చంద్రయాన్-3 ప్రయోగంలో విక్రమ్ ల్యాండర్ కేవలం ప్రజ్ఞాన్ రోవర్‌ను మాత్రమే చంద్రుడిపైకి తీసుకెళుతుంది. అంతే తప్ప ల్యాండర్‌లో ఎవరూ ఉండరు.

ఎందుకంటే.. మనుషులను తీసుకెళ్లడానికి చంద్రయాన్-3 హ్యుమన్ స్పేస్ మిషన్ కాదు. ఇండియన్ మూన్ మిషన్. ఈ మాత్రం అవగాహన కూడా లేకుండా మంత్రి స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి ‘‘ప్రయాణికులందరికీ హ్యాట్సాఫ్’’ అని వ్యాఖ్య చేసి నవ్వుల పాలు కావడం గమనార్హం. మన దేశంలోని కొందరు రాజకీయ నాయకులకు ఉన్న విషయ పరిజ్ఞానం ఏపాటిదో ఈ తరహా వ్యాఖ్యలు మరోసారి రుజువు చేశాయి. అశోక్ చంద్నా మాత్రమే కాదు చాలా సందర్భాల్లో కొందరు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కూడా ‘‘బైక్‌కు టోల్ కట్టడానికి పోయి’’ లాంటి వ్యాఖ్యలు చట్ట సభ సాక్షిగా చేసి పరువు పోగొట్టుకున్న సంగతి తెలిసిందే.


Untitled-11.jpg18.jpg

ఇక.. చంద్రయాన్-3 ప్రస్తుత స్థితి గురించి చెప్పుకుంటే.. ల్యాండర్ చంద్రుడిపై దిగాక తీసిన ఫొటోలను ఇస్రో ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలతో పాటు ల్యాండర్ విక్రమ్ జాబిల్లిపై దిగుతున్న సమయంలో తీసిన ఫొటోను కూడా ఇస్రో షేర్ చేసింది. ల్యాండర్ నీడ చంద్రుడి ఉపరితలంపై స్పష్టంగా కనిపించింది. రాళ్లు, గుంతలు లేని చదునైన ప్రదేశంలో చంద్రయాన్-3 ల్యాండ్ అయినట్లు ఆ ఫొటోను చూస్తే స్పష్టమైంది. ల్యాండర్ నుంచి రోవర్ మరికొన్ని గంటల్లో బయటకు వచ్చి చంద్రుడిపై దిగి పరిశోధనలు ఆరంభించనుంది. వెంటనే ల్యాండర్ నుంచి రోవర్ ఎందుకు బయటకు రాదంటే.. 10 మీటర్ల ఎత్తు నుంచి ల్యాండర్ కిందికి జారిపడినప్పుడు ఆ తాకిడికి పైకి లేచిన చంద్రధూళి సర్దుకోవడానికి కొన్ని గంటలు పడుతుంది. అంతా సద్దుమణిగాక.. ల్యాండర్‌లోని రోవర్ బయటకు వస్తుంది. అప్పుడు ఆ రెండూ పరస్పరం ఫొటోలు తీసుకుని భూమికి పంపుతాయి. రెండూ సురక్షితంగా ఉన్నాయనడానికి ఆ ఫొటోలే నిదర్శనం. దీంతో చంద్రయాన్-3 పూర్తిగా సఫలమైనట్టు లెక్క.

chanm3.jpg

ఇస్రో దక్షిణ ధ్రువాన్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణం అక్కడ నీటి జాడలు ఉన్నట్టు భావిస్తుండడమే. ఆ ప్రాంతంలో మంచు స్ఫటికాల రూపంలో నీటి నిల్వలున్నాయని నాసా కూడా గుర్తించింది. దక్షిణ ధ్రువంపై గురుత్వాకర్షణ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అక్కడ వెలుతురు లేకపోవడంతో ఉష్ణోగ్రతలు మైనస్‌లో ఉంటాయి. కాబట్టి అక్కడ నీరు ఉండే అవకాశం ఉంటుంది. ఇస్రో అంచనా ప్రకారం అక్కడ పది కోట్ల టన్నుల మేర నీరు ఉండొచ్చు. నీరు ఉన్న చోట మనిషి నివసించగలడు. కాబట్టి భవిష్యత్తులో చంద్రునిపై పరిశోధనలకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. ఇక్కడ రాళ్లు, శిలలు తక్కువగా ఉంటాయి. దీంతో ల్యాండర్‌ దిగడానికి కూడా ఈ ప్రాంతం అనుకూలంగా ఉంటుంది. ఇస్రో అంచనా వేసినట్టుగానే ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధృవంలో సురక్షితంగా దిగింది.

Updated Date - 2023-08-23T22:53:20+05:30 IST