Seema Haider: అక్కడ అంజుకి ఖరీదైన గిఫ్టులు.. ఇక్కడ సీమా హైదర్‌కి బంపరాఫర్.. ఏంటో తెలుసా?

ABN , First Publish Date - 2023-08-03T16:43:07+05:30 IST

ఇస్లాం మతం స్వీకరించి ఫాతిమాగా మారినందుకు, అలాగే తన పాకిస్తాన్ ప్రియుడు నస్రుల్లాని వివాహమాడినందుకు.. అంజుకి ఖరీదైన బహుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇల్లు కట్టుకోవడానికి కొంత స్థలం, 50 వేల పాకిస్తానీ రూపాయలతో మరికొన్ని గిఫ్టులను ఓ పాకిస్తానీ వ్యాపారవేత్త ఆమెకు అందజేశాడు. ఇప్పుడు ఇక్కడ సీమా హైదర్ వంతు వచ్చింది...

Seema Haider: అక్కడ అంజుకి ఖరీదైన గిఫ్టులు.. ఇక్కడ సీమా హైదర్‌కి బంపరాఫర్.. ఏంటో తెలుసా?

ఇస్లాం మతం స్వీకరించి ఫాతిమాగా మారినందుకు, అలాగే తన పాకిస్తాన్ ప్రియుడు నస్రుల్లాని వివాహమాడినందుకు.. అంజుకి ఖరీదైన బహుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇల్లు కట్టుకోవడానికి కొంత స్థలం, 50 వేల పాకిస్తానీ రూపాయలతో మరికొన్ని గిఫ్టులను ఓ పాకిస్తానీ వ్యాపారవేత్త ఆమెకు అందజేశాడు. ఇప్పుడు ఇక్కడ సీమా హైదర్ వంతు వచ్చింది. పబ్జీ గేమ్ ద్వారా పరిచయమైన తన ప్రియుడు సచిన్ కోసం పాక్ నుంచి భారత్‌లోకి అక్రమంగా వచ్చిన సీమాకు.. ఒక సినిమాలో ‘రా ఏజెంట్’గా నటించే బంపరాఫర్ దక్కింది. అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం.

ఉదైపూర్‌లో కన్హయ్య లాల్ అనే ఒక టైలర్‌ను ఇద్దరు వ్యక్తులు నరికి చంపిన ఉదంతంపై ‘ఏ టైలర్ మర్డర్ స్టోరీ’ అనే సినిమా రూపొందుతోంది. మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వీడియోని ఆ టైలర్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ తన మద్దతు తెలిపిన పాపానికి.. ఇద్దరు ఇస్లాం మద్దతుదారులు ఆయన్ను కత్తితో పొడిచి చంపారు. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే రేపింది. ఈ నేపథ్యంలోనే.. ఈ ఉదంతంపై ఒక సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఫైర్‌ఫాక్స్ ప్రొడక్షన్ హౌస్ ఈ సినిమాని నిర్మిస్తోంది. ఈ నిర్మాణ సంస్థకు సంబంధించిన ఒక టీమ్.. ఇందులో రా ఏజెంట్ పాత్ర కోసం సీమా హైదర్‌ని సంప్రదించారు. అంతేకాదు.. గ్రేటర్ నోయిడాలో ఆమెకు ఆడిషన్స్ కూడా నిర్వహించారు. ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న దర్శకులు జయంత్ సిన్హా, భరత్ సింగ్ కలిసి సీమా హైదర్‌ని ఆడిషన్ చేశారు.


అయితే.. ఈ సినిమాలో నటించేందుకు సీమా హైదర్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. తనకు ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ నుంచి క్లీన్ చిట్ వచ్చిన తర్వాతే ఈ సినిమాలో నటిస్తానని ఆమె తెలిపింది. అటు.. కన్హయ్య భార్య, అతని కుమారుడు నుంచి నిర్మాత అమిత్ జానీకి ఈ సినిమాపై నో అబ్జెక్షన్ సర్టిఫికెట్‌ వచ్చింది. ఇదిలావుండగా.. సీమా హైదర్ హిందూ మతాన్ని స్వీకరించినప్పుడు, అమిత్ ఆమెకు కాషాయ శాలువను అందించి స్వాగతించారు. ఆ సమయంలో జానీ పాదాలు తాకి, సీమా ఆయన ఆశీర్వాదం కూడా తీసుకుంది. ఇప్పుడు ఈ సినిమా నిర్మాణ బృందం, సీమా హైదర్ ఇద్దరూ ఏటీఎస్ నివేదిక కోసం వేచి చూస్తున్నారు.

Updated Date - 2023-08-03T16:43:07+05:30 IST