Gujarath: భజరంగ్‌దళ్ యాత్రపై రాళ్ల దాడి.. గుజరాత్‌లో మత ఘర్షణలు

ABN , First Publish Date - 2023-09-30T17:53:34+05:30 IST

రాష్ట్రంలో ఇరు వర్గాల మధ్య మత ఘర్షణ(Communal Riots)లు జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశ్వ హిందూ పరిషత్(VHP), భజరంగ్ దళ్(Bajarangdal) ఆధ్వర్యంలో నిర్వహించిన శౌర్య జాగరణ్ యాత్ర ఊరేగింపులో ఈ ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది.

Gujarath: భజరంగ్‌దళ్ యాత్రపై రాళ్ల దాడి.. గుజరాత్‌లో మత ఘర్షణలు

గుజరాత్: రాష్ట్రంలో ఇరు వర్గాల మధ్య మత ఘర్షణ(Communal Riots)లు జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశ్వ హిందూ పరిషత్(VHP), భజరంగ్ దళ్(Bajarangdal) ఆధ్వర్యంలో నిర్వహించిన శౌర్య జాగరణ్ యాత్ర ఊరేగింపులో ఈ ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. ఈ యాత్ర సెలంబ పట్టణంలోని మైనారిటీలు ఎక్కువగా నివసించే ప్రాంతం గుండా సాగుతుంది.


అక్కడే ఉన్న మసీదు ఎదురుగా ఈ యాత్ర కొనసాగుతుండగా పలువురు యాత్ర సంగీతాన్నితగ్గించమని కోరారు. ఇది కాస్తా ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఈ గొడవలో ఇరువర్గాలతో సంబంధం లేని కొందరు వ్యక్తులు వెనుక నుంచి రాళ్లు రువ్వడం ప్రారంభించారు.విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి టియర్ గ్యాస్(Tear Gas) ప్రయోగించారు. లాఠీ ఛార్జీ చేశారు. మొత్తం సంఘటనలో 17 మంది గాయపడ్డారు. 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని ఎస్పీ సుంబే తెలిపారు. భజరంగ్ దళ్, వీహెచ్ పీ సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 10 వరకు దేశవ్యాప్తంగా వివిధ జిల్లాలలో 'శౌర్య జాగరణ్ యాత్ర'ను నిర్వహిస్తున్నాయి.

Updated Date - 2023-09-30T17:57:54+05:30 IST