కరోనాలాంటి మరో మహమ్మారి వస్తుంది
ABN , First Publish Date - 2023-09-26T01:54:19+05:30 IST
కరోనావంటి మరో మహమ్మారి మళ్లీ కచ్చితంగా విరుచుకుపడుతుందని వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పరిశోధకురాలు షి షెంగ్లీ హెచ్చరించారు...
చైనా వైరాలజిస్టు షి షెంగ్లీ హెచ్చరిక
న్యూఢిల్లీ, సెప్టెంబరు 25: కరోనావంటి మరో మహమ్మారి మళ్లీ కచ్చితంగా విరుచుకుపడుతుందని వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పరిశోధకురాలు షి షెంగ్లీ హెచ్చరించారు. ఈ ఏడాది జూలైలో షి నేతృత్వంలోని పరిశోధకుల బృందం విడుదల చేసిన ఓ నివేదికను సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్(ఎ్‌ససీఎంపీ) పత్రిక ప్రచురించింది. మొత్తం 40 రకాల కరోనా వైర్‌సలపై తాము అధ్యయనం చేసినట్లు షి అందులో పేర్కొన్నారు. ‘‘ఆ 40 వైర్‌సలలో సగానికి పైగా అత్యంత ప్రమాదకరమైనవే. వీటిలో 6 వైర్‌సలు ఇప్పటికే మనుషులకు సోకాయి. మరో మూడు జంతువులకు సోకాయి. భవిష్యత్తులో తిరిగి మరో కరోనా వైరస్ కచ్చితంగా మానవాళిపై విరుచుకుపడుతుంది’’ అని షి తమ అధ్యయన నివేదికలో పేర్కొన్నారు.