Sunstroke Deaths: మహారాష్ట్ర ప్రభుత్వంపై హత్య కేసు నమోదు చేయాలి: ఎన్‌సీపీ నేత అజిత్ పవార్
ABN , First Publish Date - 2023-04-18T16:07:35+05:30 IST
ఈ విషాదం ఉద్దేశపూర్వకంగా కలిగించిన విపత్తు అని, ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలని లేఖలో పేర్కొన్నారు.
మహారాష్ట్ర: ఆదివారం నవీ ముంబై(Navi Mumbai)లో రాష్ట్ర అవార్డు కార్యక్రమంలో వడదెబ్బ కారణంగా13మంది మరణించిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర ప్రభుత్వం(Maharashtra Government)పై హత్యానేరం కేసు నమోదు చేయాలని ప్రతిపక్ష నేత అజిత్ పవార్(NCP's Ajit Pawar) మంగళవారం డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే(Chief Minister Eknath Shinde)కు లేఖ రాశారు. ఈ విషాదం ఉద్దేశపూర్వకంగా కలిగించిన విపత్తు అని, ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలని లేఖలో పేర్కొన్నారు.
ఆదివారం ఖర్ఘర్‌లో జరిగిన మహారాష్ట్ర భూషణ్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో లక్షలాది మంది పాల్గొన్నారు. ఈ సమయంలో అవార్డు గ్రహీత అప్పాసాహెబ్ ధర్మాధికారి(Appasaheb Dharmadhikari) అనుచరులు, అభిమానులకు చాలామంది వడదెబ్బకు గురయ్యారు. ఈ ఘటనలో 13 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని అజిత్ పవార్ మండిపడ్డారు. దురదృష్టవశాత్తు ఇది ప్రకృతి విపత్తే అయినప్పటికీ ఎలాంటి సదుపాయాలు కల్పించకుండా మానవ తప్పితం చేసి అమాయకుల ప్రాణాలు బలిగొన్నారని తెలిపారు. ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.