Watch : డ్రైనేజీలోకి దిగిన ప్రపంచ కుబేరుడు.. దేనికోసమో తెలుసా..?
ABN , First Publish Date - 2023-11-21T13:52:21+05:30 IST
నవంబర్ 19న వరల్డ్ టాయిలెట్ డే. ఈ సందర్భంగా ఓ పిక్ ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. అదేంటంటే.. ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ మ్యాన్ హోల్‌లో దిగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బిల్‌గేట్స్ ఏంటి? మురుగు కాలువలో దిగడమేంటి? అని ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదా.. కానీ ఇది అక్షరాలా నిజం.
నవంబర్ 19న వరల్డ్ టాయిలెట్ డే. ఈ సందర్భంగా ఓ పిక్ ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. అదేంటంటే.. ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ మ్యాన్ హోల్‌లో దిగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బిల్‌గేట్స్ ఏంటి? మురుగు కాలువలో దిగడమేంటి? అని ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదా.. కానీ ఇది అక్షరాలా నిజం. బిల్‌గేట్స్ బ్రస్సెల్స్‌లోని సీవర్ మ్యూజియాన్ని సందర్శించే క్రమంలో ఆయన మ్యాన్‌హోల్‌లో దిగుతున్న వీడియో వైరల్ అవుతోంది.
ఆయన అండర్ గ్రౌండ్ మ్యూజియంలో పలువురు శాస్త్రవేత్తలతో సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే నగరంలోని మురుగునీటి వ్యవస్థకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం.. 200-మైళ్ల మురుగు కాలువలు, ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నెట్‌వర్క్ అనేది నగరంలోని వ్యర్థాలను ప్రాసెస్ చేస్తుంది. ఈ సందర్భంగా బ్రస్సెల్స్‌లోని మురుగు నీటి వ్యవస్థతో పాటు మురుగు నీటి కారణంగా తలెత్తే సమస్యలను వరల్డ్ టాయిలెట్ డే సందర్భంగా తెలుసుకున్నానని బిల్‌గేట్స్ పోస్టు పెట్టారు.
‘‘బ్రసెల్‌లోని అండర్‌గ్రౌండ్ మ్యూజియంలో అన్ని విషయాలను నేను తెలుసుకున్నాను. మురుగునీటి వ్యవస్థకు సంబంధించిన చరిత్రను డాక్యుమెంట్ చేస్తున్నాను. 1800లో నగరంలోని మురుగు నీరు అంతా సెన్నే నదిలో డంప్ చేయడం జరిగింది. దీంతో భయంకరమైన కలరా వ్యాప్తి చెందింది. కానీ నేడు పరిస్థితులు మారిపోయాయి. 200-మైళ్ల డ్రైనేజ్ నెట్‌వర్క్, ట్రీట్‌మెంట్ ప్లాంట్లు నగరంలోని వ్యర్థాలను ప్రాసెస్ చేస్తాయి’’ అని వీడియోలో బిల్‌గేట్స్ తెలిపారు. మురుగునీటి సమస్యలపై జనాలకు బిల్‌గేట్స్ అవగాహన కల్పించడం ఇది తొలిసారేమీ కాదు. 2015లో మలాన్ని శుద్ధి చేసి దాని నుంచి శాస్త్రవేత్తలు తీసిన నీటిని తాగారు. అలాగే 2016లో పారిశుధ్యంపై అవగాహన కల్పించే యత్నం చేశారు.