Share News

Uttarakhand: టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్‌లో అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణులు

ABN , First Publish Date - 2023-11-20T12:12:04+05:30 IST

ఉత్తరాఖండ్(Uttarakhand)లో టన్నెల్ కుప్పకూలిన ఘటన జరిగి నేటికి 9 రోజులు. టన్నెల్(Uttarakhand Tunnel Collapse)లో చిక్కుకుపోయిన 41 మంది కార్మికుల ప్రాణాలు దక్కుతాయన్న ఆశలు సన్నగిల్లుతున్నాయి. అమెరికా యంత్రాల సాయంతో కార్మికులను చేరుకోవాలనే ప్రయత్నాలు ఆశించినమేర ఫలించలేదు. దీంతో ఇవాళ అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణులు కార్మికులను రక్షించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

Uttarakhand: టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్‌లో అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణులు

డెహ్రడూన్: ఉత్తరాఖండ్(Uttarakhand)లో టన్నెల్ కుప్పకూలిన ఘటన జరిగి నేటికి 9 రోజులు. టన్నెల్(Uttarakhand Tunnel Collapse)లో చిక్కుకుపోయిన 41 మంది కార్మికుల ప్రాణాలు దక్కుతాయన్న ఆశలు సన్నగిల్లుతున్నాయి. అమెరికా యంత్రాల సాయంతో కార్మికులను చేరుకోవాలనే ప్రయత్నాలు ఆశించినమేర ఫలించలేదు. దీంతో ఇవాళ అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణులు కార్మికులను రక్షించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

అక్కడికి చేరుకుని ఇప్పటివరకు జరిగిన ఆపరేషన్స్ ని అడిగి తెలుసుకున్నారు. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) చార్ ధామ్ మార్గంలోని సిల్క్యారా సొరంగం బార్‌కోట్ చివరలో డ్రిల్లింగ్ చేపట్టింది. అందులో కొంత భాగం నవంబర్ 12 న కూలిపోయింది. ఉత్తరకాశీలో జరిగిన ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. 41 మంది కార్మికులు అందులోనే చిక్కుకుపోయారు.

9 రోజులు గడుస్తున్న వారిని బయటకి తీయలేకపోవడంతో టన్నెల్ బయట నిరీక్షిస్తున్న కార్మికుల కుటుంబసభ్యుల్లో ఆందోళన అంతకంతకూ తీవ్రమవుతోంది. అమెరికన్‌ ఆగర్‌ యంత్రంతో సహాయక చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. ఇంటర్నేషనల్ టన్నెలింగ్, అండర్‌గ్రౌండ్ స్పేస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్నాల్డ్ డిక్స్ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్న నిపుణులలో ఉన్నారు. ONGC డ్రిల్లింగ్ హెడ్ సోమవారం సైట్‌ను సందర్శించారు. మరుసటి రోజు నివేదిక సమర్పిస్తారు.


ఫుడ్, మెడిసిన్ పంపుతున్న అధికారులు..

టన్నెల్ లో చిక్కుకున్న 41 మంది కార్మికులు సజీవంగా ఉండేందుకు మల్టీవిటమిన్లు, యాంటిడిప్రెసెంట్స్, డ్రై ఫ్రూట్స్ పంపుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి అనురాగ్ జైన్ తెలిపారు. యూఎస్ కి చెందిన ఆగర్ యంత్రం, డ్రిల్ చేస్తూ శిథిలాల గుండా పైపులను నెడుతోంది. కార్మికులు బయటపడేందుకు మరో మార్గాన్ని సిద్ధం చేస్తోంది. శుక్రవారం డ్రిల్లింగ్ నిలిపేసే సమయానికి ఆగర్ యంత్రం 40 మీటర్ల శిథిలాల ద్వారా డ్రిల్లింగ్ చేసి.. సొరంగం లోపల 60 మీటర్ల విస్తీర్ణంలో వ్యాపించింది. ఆరు అంగుళాల వ్యాసం కలిగిన పైపు ఇంకా కార్మికులకు చేరలేదు, ఇది వారికి సరైన ఆహారాన్ని అందజేస్తుంది.

కార్మికులను రక్షించేందుకు జరుగుతున్న సహాయక చర్యల గురించి ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీతో ఫోన్‌లో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో వారిని సేఫ్ గా బయటకి తీసుకొస్తామని ప్రధాని అన్నారు. కార్మికులకు ధైర్యాన్ని అందించాలని కోరారు. కేంద్ర ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యల్ని ముమ్మరం చేశామని ధామీ చెప్పారు. నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHIDCL) ఆధ్వర్యంలో ఈ సొరంగం నిర్మాణం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చార్ ధామ్ ఆల్-వెదర్ రోడ్ ప్రాజెక్ట్‌లో భాగం.

Updated Date - 2023-11-20T12:13:11+05:30 IST