మతం పేరుతో శిక్షిస్తే ప్రమాణాలు ఏమున్నట్టు?

ABN , First Publish Date - 2023-09-26T01:48:23+05:30 IST

మతపరమైన కారణాలతో యూపీలోని ముజఫర్‌నగర్‌ జిల్లాలో ఓ విద్యార్థిని తోటి విద్యార్థులతో ఉపాధ్యాయురాలే కొట్టించిన ఘటన..

మతం పేరుతో శిక్షిస్తే ప్రమాణాలు ఏమున్నట్టు?

న్యూఢిల్లీ, సెప్టెంబరు 25: మతపరమైన కారణాలతో యూపీలోని ముజఫర్‌నగర్‌ జిల్లాలో ఓ విద్యార్థిని తోటి విద్యార్థులతో ఉపాధ్యాయురాలే కొట్టించిన ఘటన తీవ్రమైన విషయమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మతం పేరుతో శిక్షలు విధిస్తే విద్యా ప్రమాణాలు ఎక్కడ ఉన్నట్టని ప్రశ్నించింది. దీనిపై సీనియర్‌ ఐపీఎస్‌ అధికారితో దర్యాప్తు చేయించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వారం రోజుల్లోగా దర్యాప్తు అధికారిని నియమించాలని సూచించింది. ఈ ఘటనపై త్వరగా దర్యాప్తు జరిపించాలని కోరుతూ మహాత్మాగాంధీ మునిమనుమడు తుషార్‌ గాంధీ దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా కోర్టు సోమవారం ఈ ఆదేశాలను జారీచేసింది. దర్యాప్తు అధికారి నేరుగా సుప్రీంకోర్టుకే నివేదిక సమర్పించాలని సూచించింది. తదుపరి విచారణను అక్టోబరు 30కి వాయిదా వేసింది.

Updated Date - 2023-09-26T01:48:23+05:30 IST