Indian Census: అసలు జనాభా గణన అవసరం ఏంటి? ఆలస్యం వల్ల కలిగే నష్టాలేంటి?

ABN , First Publish Date - 2023-09-30T16:24:22+05:30 IST

ప్రతి పదేళ్లకోసారి జనాభా గణనను చేపడతారన్న విషయం అందరికీ తెలిసిందే. 1881 నుంచి మొదలుకొని ఇప్పటివరకు 16 సార్లు జనాభా లెక్కలు నిర్వహించారు. అయితే.. కొవిడ్ లాక్డౌన్ కారణంగా మోదీ ప్రభుత్వం..

Indian Census: అసలు జనాభా గణన అవసరం ఏంటి? ఆలస్యం వల్ల కలిగే నష్టాలేంటి?

ప్రతి పదేళ్లకోసారి జనాభా గణనను చేపడతారన్న విషయం అందరికీ తెలిసిందే. 1881 నుంచి మొదలుకొని ఇప్పటివరకు 16 సార్లు జనాభా లెక్కలు నిర్వహించారు. అయితే.. కొవిడ్ లాక్డౌన్ కారణంగా మోదీ ప్రభుత్వం 2021 జనాభా గణన చేపట్టలేదు. ఇప్పటికీ ఈ ప్రాసెస్ చేపట్టలేదు. నిజానికి.. ఈసారి ఈ అంశాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ.. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ‘నారీ శక్తి వందన్ చట్టం’ బిల్లు ఆమోదం పొందిన తర్వాత.. భారత జనాభా లెక్కలపై చర్చ మొదలైంది. జనాభా గణనతో పాటు డీలిమిటేషన్ పూర్తయ్యాకే.. ఈ బిల్లు అమలు అవుతుందని తెలిపారు. దీంతో.. ఇప్పుడు జనాభా గణన అనేది అవసరం అయ్యింది.


అసలు జనాభా గణన అవసరం ఏంటి?

మన దేశం చాలా పెద్దది. ఇక్కడో విధానాన్ని రూపొందించడానికి జనాభా గణన డేటా అవసరం. ఇది జనాభాపై ఎంత ప్రభావం చూపబోతోందో చెప్పగలదు. వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా సేకరిస్తున్న పాలసీలను రూపొందించేందుకు అడ్మినిస్ట్రేటివ్ డేటాపై ప్రభుత్వం ఆధారపడవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రతి విభాగానికి దానకంటూ స్వంత పథకాలుంటాయి. దాని కోసం డేటాని సేకరించడం జరుగుతుంది. ఈ డేటాని ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది. అయితే.. పరిపాలనా డేటాతో ఉన్న అతిపెద్ద సమస్య ఏమిటంటే, వలస కూలీలు దీని పరిధిలోకి రారు. పాలసీని రూపొందిస్తున్నప్పుడు ఈ డేటా నుంచి వలస కార్మికుల్ని మినహాయిస్తారు. అడ్మినిస్ట్రేటివ్ డేటా ఆధారంగానే.. మన దేశం బహిరంగ మలవిసర్జన రహితంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.

జనాభా గణన ఆలస్యమైతే కలిగే నష్టాలేంటి?

మన దేశంలోని మొత్తం గణాంక వ్యవస్థకు జనాభా గణన ఓ పునాది. జనాభా లెక్కల ఆధారంగా సర్వేలన్నీ నిర్వహిస్తారు. ఒకవేళ జనాభా గణన నిర్వహించకపోతే.. డేటా సిస్టమ్‌ను సిద్ధం చేయడం కష్టమవుతుంది. ఆలస్యమైతే.. పాలసీలు ప్రభావితం అవుతాయి. పాలసీ ప్రయోజనాలు పొందాల్సిన వారు వెనుకబడిపోతారు. ఏ పథకం ద్వారా ఎవరు లబ్ది పొందుతున్నారో ప్రభుత్వం గుర్తించలేదు. జనాభా లెక్కల డేటా లేకపోతే.. ప్రభుత్వ రంగంపై కూడా ప్రభావం చూపుతుంది. జీవిత బీమా పాలసీలు, ప్రైవేట్ కంపెనీలు ఏ సమూహాన్ని లక్ష్యంగా చేసుకోవాలో అర్థం చేసుకోవడానికి.. జనాభా గణన సహాయపడుతుంది. జనాభా లెక్కలు లేకపోతే.. నిరుద్యోగుల డేటా, అంతర్గత వలసలు ఎలా జరుగుతున్నాయన్న వివరాలు పొందడం కష్టతరం అవుతుంది.

Updated Date - 2023-09-30T16:24:22+05:30 IST