Home Tips: వర్షాకాలంలో అన్ని ఇళ్లలోనూ ఇదే సమస్య.. ఎండ అసలే లేకున్నా.. దుస్తులు త్వరగా ఆరిపోవాలంటే..!
ABN , First Publish Date - 2023-07-13T15:22:31+05:30 IST
తడి దుస్తులను ఆరబెట్టడానికి కూడా హెయిర్ డ్రైయర్ ఉపయోగించవచ్చు. హెయిర్ డ్రైయర్ నుండి వచ్చే వేడి గాలికి, దుస్తులు త్వరాగా ఆరేందుకు అవకాశం ఉంటుంది.
వర్షాకాలం వచ్చిందంటే చల్లదనంతో పాటు కాసిని కష్టాలను కూడా పట్టుకొస్తుంది. వాతావరణం చల్లగా మారిపోయిందని తెగ సంబరపడిపోతాం కానీ ఇల్లంతా చెమ్మగా ఉండటం, తేమగా ఉండటంతో పాటు, తడివాతావరణంలో దుస్తులు సరైన సమయంలో ఆరకపోవడం, వాసన రావడం జరుగుతుంది. కొన్నిసార్లు రోజంతా వర్షం పడుతుంది. కొన్నిసార్లు రాత్రుళ్ళు తడిగా, జల్లులతో ఉంటాయి. రోజంతా వర్షం పడితే, దుస్తులు ఆరబెట్టడానికి సూర్యరశ్మి లేదా వేడి ఉండదు, దీని కారణంగా దుస్తులు రోజులు గడిచినా కూడా తడిగా ఉంటాయి. వాషింగ్ మిషన్ లో దుస్తులు వేసినా కూడా వాటిని ఆరబెట్టే ఛాన్స్ ఉండదు. అసలు తడి దుస్తులు త్వరగా ఆరబెట్టడానికి ఏ పద్ధతులు ఉపయోగపడతాయో చూద్దాం.
వర్షాకాలంలో దుస్తులు ఆరబెట్టడం ఎలా?
వర్షంలో తడి దుస్తులు ఆరబెట్టడానికి 2 టవల్స్ ఉపయోగించండి, ఉతికిన తర్వాత దుస్తుల్ని ఈ 2 టవల్స్ మధ్య ఉంచి గట్టిగా పిండాలి. నీరు బయటకు వస్తుంది. ఇది ఒక టెక్నిక్. చిన్న పిల్లల దుస్తులు త్వరగా ఆరేందుకు ఇది సరిపోతుంది.
ఇది కూడా చదవండి: కూరల్లో వాడే అల్లానికి.. జుట్టుకు సంబంధమేంటని అవాక్కవుతున్నారా..? అల్లాన్ని ఇలా వాడితే..!
హెయిర్ డ్రైయర్
తడి దుస్తులను ఆరబెట్టడానికి కూడా హెయిర్ డ్రైయర్ ఉపయోగించవచ్చు. హెయిర్ డ్రైయర్ నుండి వేడి గాలి తగిలి, దుస్తులు త్వరాగా ఆరేందుకు అవకాశం ఉంటుంది. తడి తగ్గినప్పుడు, వాటిని గాలిలో కొంతసేపు ఉంచి ఆరబెట్టండి.
ఇంట్లో ఎలా తడి దుస్తులు ఆరబెట్టాలి,
దుస్తులు వేయడానికి, అల్మారాలో దుస్తులు వేలాడదీయడానికి వాడే హ్యాంగర్లను ఉపయోగించండి. ఈ హ్యాంగర్‌ని కిటికీ పైపుపై వేలాడదీయండి, అన్ని వైపుల నుండి గాలి తగిలి, త్వరగా ఆరిపోతాయి.