Biryani : ఒకే బిర్యానీ ఆకు.. గుప్పెడు ఉపయోగాలు!

ABN , First Publish Date - 2023-02-09T00:16:36+05:30 IST

ప్రాంతాన్ని బట్టి పలు రకాల ఆకుల్ని వండేప్పుడు ఆహారంలో వేస్తారు. ముఖ్యంగా బిర్యానీతో పాటు పప్పు ధాన్యాలు, సూప్స్‌, తేనీరులో వీటిని కలిపి కుక్‌ చేస్తారు.....

Biryani : ఒకే బిర్యానీ ఆకు.. గుప్పెడు ఉపయోగాలు!

ప్రాంతాన్ని బట్టి పలు రకాల ఆకుల్ని వండేప్పుడు ఆహారంలో వేస్తారు. ముఖ్యంగా బిర్యానీతో పాటు పప్పు ధాన్యాలు, సూప్స్‌, తేనీరులో వీటిని కలిపి కుక్‌ చేస్తారు. రుచి, సువాసన, తాజాదనంతో పాటు ఆరోగ్యానికీ ఈ బిర్యానీ ఆకులు మేలు చేస్తాయి.

  • మాంసంతో కలిపి వండినపుడు, లేదా మరే ఆహారంలో అయినా బిర్యానీ ఆకుల్ని వాడితే తిన్న ఆహారం సులువుగా జీర్ణమవుతుంది. గ్యాస్‌ట్రబుల్‌, వాంతి చేసుకోవటం లాంటి సమస్యలు ఉండవు.

  • ఈ ఆకులతో చేసిన టీ ప్రతిరోజూ తాగితే శరీరంలోని చెడు కొలెస్ర్టాల్‌ కరిగిపోతుంది.

  • ఈ ఆకుల్లో ఐరన్‌, కాల్షియం, మాంగనీసుతో పాటు విటమిన్‌-కె పుష్కలం కాబట్టి ఎముకల దృఢత్వానికి, పటుత్వానికి ఉపయోగం.

  • రక్తంలోని చక్కెరశాతాన్ని అదుపులో ఉంచుతుంది. చక్కటి నిద్ర పడుతుంది.

  • రక్తపోటును అదుపులో ఉంచుతుంది. దీంతో గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

  • జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

  • ఈ రోజుల్లో ఆందోళన, ఒత్తిడి సహజంగా ఉంటున్నాయి. ఈ ఆకుల్లో ఉండే లినూల్స్‌ శరీరంలోని ఒత్తిడి కలిగించే హార్మోన్లను అదుపు చేసే గుణం ఉంటుంది. అందుకే ఆందోళన, ఒత్తిడి తగ్గిపోతాయి.

  • ఈ హెర్బల్‌ ఆకుల రసాన్ని కీళ్లవాపులు, కండరాల నొప్పులను తగ్గించడానికి వాడతారు.

  • శరీరంలోని ఫ్రీరాడికల్స్‌ను తొలగిస్తుంది. ఫ్లూ తగ్గిస్తుంది. దీంతో పాటు వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.

  • కంటిచూపుతో పాటు చర్మఆరోగ్యానికి ఎంతో మంచిది.

  • ఆరోగ్యానికి మంచిదని మూడు కంటే ఎక్కువ బిర్యానీ ఆకులు వేసుకుంటే రక్తం గడ్డకట్టకపోవడంతో మరిన్ని సమస్యలు తలెత్తుతాయి.

  • బిర్యానీ ఆకుల పొడి నీటిలో కలిపి ఉదయం, సాయంత్రం పూట తాగడం అలవాటు చేసుకుంటే మధుమేహం ఉండేవారికి ఎంతో మంచిది.

  • దగ్గు, వైరల్‌ ఫీవర్లలాంటివి తగ్గిపోతాయి.

Updated Date - 2023-02-09T06:44:14+05:30 IST