Ajay Devgn : నా వల్లే ఆస్కార్‌ వచ్చింది!

ABN , First Publish Date - 2023-03-26T01:17:45+05:30 IST

‘నాటు నాటు’ పాటకు ఆస్కార్‌ రావడం పట్ల నటుడు అజయ్‌ దేవగణ్‌ సరదా వ్యాఖ్యలు చేశారు. తన వల్లే ఆ పాటకు ఆస్కార్‌ వచ్చిందని

 Ajay Devgn : నా వల్లే ఆస్కార్‌ వచ్చింది!

‘నాటు నాటు’ పాటకు ఆస్కార్‌ రావడం పట్ల నటుడు అజయ్‌ దేవగణ్‌ సరదా వ్యాఖ్యలు చేశారు. తన వల్లే ఆ పాటకు ఆస్కార్‌ వచ్చిందని వ్యాఖ్యానించారు. ఓ ఇంటర్వ్యూలో ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ చిత్రానికి ఆస్కార్‌ రావడంపై మీ స్పందన ఏమిటి?’ అంటూ వ్యాఖ్యాత అజయ్‌ని ప్రశ్నించారు. దానికి స్పందిస్తూ ‘ఈ చిత్రానికి నా వల్లే ఆస్కార్‌ వచ్చింది. ఎన్టీఆర్‌, చరణ్‌లు కాకుండా నేను డాన్స్‌ చేసి ఉంటే.. ఏమయ్యేదో తెలుసు కదా?’ అంటూ అజయ్‌ తనపై తానే సెటైర్‌ వేసుకొన్నారు. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అజయ్‌ దేవగణ్‌ కూడా ఓ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. సీతారామరాజు (చరణ్‌) తండ్రిగా ఆయన నటించారు. అజయ్‌ కీలక పాత్ర పోషించిన ‘భోళా’ ఈనెల 30న విడుదల అవుతోంది. దక్షిణాదిన ఘన విజయం సాధించిన ‘ఖైది’ చిత్రానికి ఇది రీమేక్‌.

Updated Date - 2023-03-26T01:17:45+05:30 IST