Amla Storage : ఉసిరి నిల్వ ఇలా...
ABN , First Publish Date - 2023-12-07T04:08:24+05:30 IST
మన రోగనిరోధక శక్తి పెరగాలన్నా.. విటమిన్ సి తగినంత కావాలన్నా ఆహారంలో ఉసిరి ఎంతో ముఖ్యమైనది. దీనిని ప్రతి రోజూ క్రమం తప్పకుండా
మన రోగనిరోధక శక్తి పెరగాలన్నా.. విటమిన్ సి తగినంత కావాలన్నా ఆహారంలో ఉసిరి ఎంతో ముఖ్యమైనది. దీనిని ప్రతి రోజూ క్రమం తప్పకుండా తింటే అనేక రుగ్మతలు తగ్గుతాయి. అయితే ఉసిరి సంవత్సరంలో కొన్ని సార్లు మాత్రమే లభిస్తుంది. ఇలాంటి ఉసిరిని ఎలా నిల్వ చేసుకోవాలో చూద్దాం.
ఉసిరికి నీరు తగిలితే పాడైపోతుంది. అందువల్ల ఉసిరిని నీరు తగలకుండా.. గాలి, వెలుతురు ఉన్న ప్రాంతంలో నిల్వ చేయాలి. కొద్దిగా ఎండలో ఉంచితే తేమ తొలగిపోయి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.
ఎండలో ఉంచటం వీలు కాకపోతే- గాలి సోకని గ్లాసు కంటైనర్లలో నిల్వ చేసుకోవచ్చు. దీని వల్ల కూడా ఉసిరి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.
వేడి చేసిన ఉప్ప నీళ్లలో ఉసిరి కాయలను వేసి ఉడకపెట్టాలి. వీటిని గాలి సోకని కంటైనర్లలో నిల్వ చేయాలి. ఇలా నిల్వ చేసిన ఉసిరికాయలు సుమారు నాలుగు నెలలు చెడిపోకుండా ఉంటాయి.
ఉసిరికాయల్లో గింజలను తీసి ఎండపెట్టాలి. బాగా ఎండిన తర్వాత ఉసిరి ముక్కలను పొడిగా చేయాలి. ఈ పొడిని వంటల్లో వాడుకోవచ్చు.
ఉసిరి కాయలను కొద్దిగా పంచదార వేసి ఉడకపెట్టాలి. ఇలా ఉడికిన ఉసిరి కాయలను బయట ఎండపెట్టాలి. ఈ ఉసిరి కాయ ముక్కలను మౌత్ ఫ్రెషనర్స్‌గా వాడకోవచ్చు.
ఉసిరికాయను ముక్కలుగా చేసి మిక్సిలో ముద్దగా రుబ్దుకోవాలి. ఈ ముద్దలో పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ ముద్దను గాలి సోకని కంటైనర్స్‌లో లేదా జిప్‌లాక్ బ్యాగ్స్‌లో వేసి ఫ్రిజర్‌లో భద్రపరుచుకోవాలి. ఈ ఉసిరికాయ ముద్ద ఒక ఏడాది దాకా పాడుకాదు.