Apple Earbuds : హెల్త్‌ టూల్స్‌గా యాపిల్‌ ఇయర్‌బడ్స్‌!

ABN , First Publish Date - 2023-03-17T23:23:17+05:30 IST

వైర్‌లెస్‌ బ్లూటూత్‌ ఇయర్‌బడ్స్‌ను యాపిల్‌ ‘హెల్త్‌ టూల్‌’గా మార్చే యత్నంలో ఉంది. బ్లూమ్‌బర్గ్‌ నివేదిక ప్రకారం ఎయిర్‌పాడ్స్‌లో ఇప్పటికే సంబంధిత ఫీచర్‌ ఒకటి ఉంది.

Apple Earbuds : హెల్త్‌ టూల్స్‌గా యాపిల్‌ ఇయర్‌బడ్స్‌!

వైర్‌లెస్‌ బ్లూటూత్‌ ఇయర్‌బడ్స్‌ను యాపిల్‌ ‘హెల్త్‌ టూల్‌’గా మార్చే యత్నంలో ఉంది. బ్లూమ్‌బర్గ్‌ నివేదిక ప్రకారం ఎయిర్‌పాడ్స్‌లో ఇప్పటికే సంబంధిత ఫీచర్‌ ఒకటి ఉంది. దాంతో వాటిని అనధికారికంగా హియరింగ్‌ పరికరంగా ఉపయోగించుకోవచ్చు. దాంట్లో ఉన్న ‘లివ్‌ లిజన్‌’ ఫీచర్‌ అందుకు పనికొస్తుంది. ఆ ఎయిర్‌పాడ్ప్‌నే ఎఫ్‌డీఏ ఆమోదిత హియరింగ్‌ ఎయిడ్‌గా యాపిల్‌ మార్చనుంది. హియరింగ్‌ ఎయిడ్స్‌కు సంబంధించి అమెరికాలో ఇటీవల చేసిన మార్పులు యాపిల్‌ తన లక్ష్యాన్ని చేరుకునేందుకు ఉపయోగపడనున్నాయని సమాచారం. ప్రిస్ర్కిప్షన్‌ లేకుండానే హియరింగ్‌ ఎయిడ్స్‌ను కొనుగోలు చేసుకోవచ్చని అమెరికా ఇటీవల పేర్కొంది. యాపిల్‌ ఇకపై తీసుకువచ్చే ఎయిర్‌పాడ్స్‌ను వినికిడికి సాధనంగానూ మార్చుకునే వెసులుబాటు ఈ నిబంధనతో లభించింది. లైవ్‌ లిజన్‌కు తోడు వీటితోనే వినికిడి ఇబ్బందులు ఉన్న వారికీ ప్రయోజనకరంగా మారుతుంది. లైవ్‌ లిజన్‌ అంత గొప్పగా కాకున్నా కనీసం జరుగుతున్న సంభాషణను ఫాలో కాగలిగే అవకాశాన్ని కల్పిస్తుంది.

Updated Date - 2023-03-17T23:23:17+05:30 IST