Twitter : ట్విటర్‌లో బ్లాక్
ABN , First Publish Date - 2023-04-21T23:13:34+05:30 IST
ట్విటర్‌లో మనం వద్దు అనుకునే అకౌంట్లను బ్లాక్ చేసుకునే వెసులుబాటు ఉంది. సదరు ఫీచర్‌తో ఆ వ్యక్తులను కాంటాక్ట్ చేయడం
ట్విటర్‌లో మనం వద్దు అనుకునే అకౌంట్లను బ్లాక్ చేసుకునే వెసులుబాటు ఉంది. సదరు ఫీచర్‌తో ఆ వ్యక్తులను కాంటాక్ట్ చేయడం సహా వాళ్ళ ట్వీట్ల వీక్షణ, ఫాలో కావడం వంటివి కూడా కట్టిపెట్టేయవచ్చు. ఒకసారి బ్లాక్ అంటూ చేస్తే మాత్రం ఈ ప్లాట్‌ఫాంపై వాళ్ళను ఫాలో కాలేరు. అది అన్‌ఫాలోకు దారితీస్తుంది. అకౌంట్ బ్లాకు చేసి ఉండి, వాళ్ళు రిపోర్టు చేయాలనుకుంటే - వాళ్ళను ఉద్దేశించి చేసిన ట్వీట్లు సదరు వ్యక్తులకు కనిపిస్తాయి. రిపోర్టింగ్ ప్రాసె్‌సలో వాటిని జత చేయగలుగుతారు కూడా. బ్లాకింగ్ ప్రక్రియలో భాగంగా
ట్వీట్ టాప్‌లో ఉన్న త్రీడాట్ ఐకాన్‌ను క్లిక్ చేయాలి. అది బ్లాక్ చేయాలని అనుకునే అకౌంట్‌దై ఉండాలి.
బ్లాక్‌పై క్లిక్ చేయాలి. కన్‌ఫర్మ్ కోసం బ్లాక్‌ను సెలెక్ట్ చేయాలి.
మరోపక్క ట్విటర్ ప్రొఫైల్‌ని బ్లాక్ చేసేందుకు
బ్లాక్ చేయాలని భావిస్తున్న అకౌంట్ ప్రొఫైల్‌లోకి వెళ్ళాలి.
త్రీ డాట్ ఐకాన్ పక్కన ఉండే ప్రొఫైల్ పేజీపై క్లిక్ చేయాలి.
మెనూ నుంచి బ్లాక్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.
కన్‌ఫర్మ్ చేసుకునేందుకు చివరగా బ్లాక్‌పై క్లిక్ చేయాలి.
వాళ్ళ ప్రొఫైల్‌ను విజిట్ చేసే సమయంలో బ్లాక్ చేసిన అకౌంట్ల నుంచి వచ్చే ట్వీట్లు దాగి ఉంటాయి. అయితే ఎస్, వ్యూ ప్రొఫైల్ బటన్ నొక్కి అక్కడి ట్వీట్లు చూడవచ్చు.
ఫాలో కావచ్చు!
అన్ ఫాలో లేదంటే బ్లాక్ చేయకుండా తమ టైమ్‌లైన్ నుంచి ఏదైనా అకౌంట్‌కు చెందిన ట్వీట్స్‌ను తొలగించే వెసులుబాటు ఉంది. దీంతో మ్యూట్ చేయడమే కాదు, అ చర్యనుంచి తప్పించనూవచ్చు. మ్యూట్ చేసిన అకౌంట్స్ వివరాలు తెలుసుకోవాలంటే ట్విటర్.కామ్ లేదంటే ఐఓఎస్ లేదా ఆండ్రాయిడ్ ట్విటర్‌లో చూసుకోవచ్చు.
మ్యూట్ చేసిన అకౌంట్స్‌ను ఫాలో కావచ్చు. మ్యూట్ అయిన అకౌంట్ హోల్డర్లు మ్యూట్ చేసిన వారిని ఫాలో కావచ్చు. డైరెక్ట్ మెసేజ్‌లపై కూడా దీని ప్రభావం ఉండదు.
మ్యూట్ చేసేందుకు ట్వీట్ దగ్గర త్రీడాట్ ఐకాన్‌పై క్లిక్, మ్యూట్ చేయాలి. వెబ్‌లో ఈ పని చేస్తే కన్ఫర్మేషన్ బ్యానర్ కనిపిస్తుంది. తప్పు చేస్తే అన్‌డూ ని క్లిక్ చేయాలి. అప్పుడు అకౌంట్ అన్‌మ్యూట్ అవుతుంది.
ఒక ప్రొఫైల్ నుంచి ట్విటర్ అకౌంట్‌ని మ్యూట్ చేయవచ్చు. అందుకోసం సదరు వ్యక్తి ప్రొఫైల్‌లోకి వెళ్ళాలి. మోర్ ఐకాన్‌ని క్లిక్ చేయాలి. లిస్ట్ అయిన ఆప్షన్స్ నుంచి మ్యూట్‌ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది.