Padmavati Goddess : పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు
ABN , First Publish Date - 2023-11-10T04:45:01+05:30 IST
తిరుపతి జిల్లాలోని తిరుచానూరులో కొలువైన పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నేడు ప్రారంభం అవుతున్నాయి. ఈ నెల 18వ తేదీ వరకూ...
తిరుపతి జిల్లాలోని తిరుచానూరులో కొలువైన పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నేడు ప్రారంభం అవుతున్నాయి. ఈ నెల 18వ తేదీ వరకూ... తొమ్మిది రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాల్లో వివిధ వాహన సేవలను నిర్వహిస్తారు. వివరాలు:
నవంబర్ 10: ధ్వజారోహణం, చిన్న శేష వాహనం
నవంబర్ 11: పెద్ద శేష వాహనం, హంసవాహనం
నవంబర్ 12: ముత్యపు పందిరి వాహనం,
సింహ వాహనం
నవంబర్ 13: కల్పవృక్ష వాహనం,
హనుమంత వాహనం
నవంబర్ 14: పల్లకీ ఉత్సవం, వసంతోత్సవం,
గజ వాహనం
నవంబర్ 15: సర్వభూపాల వాహనం, స్వర్ణ రథం,
గరుడ వాహనం
నవంబర్ 16: సూర్యప్రభ వాహనం,
చంద్రప్రభ వాహనం
నవంబర్ 17: రథోత్సవం, అశ్వ వాహనం,
నవంబర్ 18: పంచమీ తీర్థం, ధ్వజావరోహణం
ఈ వాహన సేవలు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు నిర్వహిస్తారు. కాగా ఉత్సవాలు ముగిశాక...
19వ తేదీన పుుష్పయాగం జరుగుతుంది.
కార్తీక మాస పర్వదినాలు
పవిత్రమైన కార్తీక మాసం నవంబరు 14 నుంచి
మొదలవుతుంది. ఈ మాసంలో అన్ని రోజులనూ,
ప్రత్యేకించి సోమవారాలను శివారాధనకు విశిష్టమైనవిగా భక్తులు భావిస్తారు. ఇతర ప్రధానమైన రోజులు: నవంబరు 15: యమ విదియ; భగీనీ హస్తభోజనం, నవంబర్ 17: నాగుల చవితి; నవంబర్ 23: కార్తీక శుద్ధ (ఉత్థాన) ఏకాదశి); నవంబర్ 24: క్షీరాబ్ధి ద్వాదశి; నవంబర్ 26: కార్తీక పౌర్ణమి, జ్వాలా తోరణం; నవంబర్ 30: ఆరుద్రోత్సవం (శివునికి ప్రీతిపాత్రమైన ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజు), డిసెంబర్ 10: నందీశ్వర అభిషేకానికి విశిష్టమైన త్రయోదశి.