సాధుజనుల లక్షణం
ABN , First Publish Date - 2023-06-16T05:34:33+05:30 IST
ఛిన్నోపి రోహతి తరుః క్షీణోప్యుపచీయతే పునశ్చంద్రః
సుభాషితం
ఛిన్నోపి రోహతి తరుః క్షీణోప్యుపచీయతే పునశ్చంద్రః
ఇతి విమృశంతః సంతః సంతప్యంతే న విప్లుతా లోకే
మంచి నడవడిక కలిగినవారి లక్షణాలు ఎలా ఉంటాయో భర్తృహరి తన నీతి శతకంలోని ఈ శ్లోకంలో వివరించాడు. దాన్ని...
ఖండితంబయ్యు భూజంబు వెండి మొలచు
క్షీణుఁడయ్యును నభివృద్ధి జెందు సోముఁ
డివ్విధమున విచారించి యొడలుఁ దెరవ
జనములకు దాపమొందరు సాధు జనులు
అంటూ తెలుగువారికి ఏనుగు లక్ష్మణకవి అందించాడు.
‘‘మానవ జీవితానికి కష్ట సుఖాలు తప్పనిసరి. కష్టపడినప్పుడే సుఖాల విలువ తెలుస్తుంది. చెట్టును నరికేసినా అది మళ్ళీ చిగురించి, మొలుస్తుంది. చంద్రుడు క్రమక్రమంగా క్షీణిస్తాడు. కానీ పౌర్ణమి నాటికి మళ్ళీ పరిపూర్ణుడవుతాడు. వెన్నెల కురిపిస్తాడు. మంచి నడవడిక, సాధు స్వభావం కలిగిన మనుషులు కూడా అంతే. వాళ్ళు కష్టాలు ఎదురైతే కుంగిపోరు. కష్టాల వెనుకే సుఖాలు ఉంటాయనీ, తమకు మళ్ళీ మంచి రోజులు వస్తాయనే ధైర్యంతో ఉంటారు. అటువంటి వారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు’’ అని భావం