Spam Calls: స్పామ్‌ కాల్స్‌కు చెక్‌

ABN , First Publish Date - 2023-02-24T23:40:47+05:30 IST

సమాచార మార్పిడికి సెల్‌ఫోన్‌ అనువైన సాధనం. అయినప్పటికి కొన్ని కాల్స్‌ యూజర్‌ను చీకాకు పెడతాయి.

 Spam Calls: స్పామ్‌ కాల్స్‌కు చెక్‌

అలర్ట్‌

సమాచార మార్పిడికి సెల్‌ఫోన్‌ అనువైన సాధనం. అయినప్పటికి కొన్ని కాల్స్‌ యూజర్‌ను చీకాకు పెడతాయి. క్రెడిట్‌ కార్డు ఇప్పిస్తామంటూ కొందరు, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్ల వివరాలు అంటూ మరికొందరు, ఇన్‌స్టాంట్‌ లోన్‌ అంటూ ఇంకొందరు చేసే కాల్స్‌ మనిషిని ఇరిటేట్‌ చేస్తాయంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి కాల్స్‌కు చెక్‌ పెట్టాలంటే...

మొబైల్‌ నంబర్‌పై ఫోన్‌లో డీఎన్‌డీని యాక్టివేట్‌ చేసుకోవాలి. అందుకోసం 1909 నంబర్‌కు ఫుల్లీ బాక్‌ అని టెక్స్ట్‌ మెసేజ్‌ పంపాలి. దానికి తోడు కింద ఉన్న కోడ్స్‌ని కూడా ఉపయోగించుకోవాలి.

spam-calls.jpg

అన్ని కేటగిరీలకు - ఫుల్లీ బ్లాక్‌

బ్లాక్‌ 1 - బ్యాంకింగ్‌/ ఇన్సూరెన్స్‌/ క్రెడిట్‌ కార్డ్స్‌/ ఫైనాన్షియల్‌ ప్రొడక్ట్స్‌

బ్లాక్‌ 2 - రియల్‌ ఎస్టేట్‌

బ్లాక్‌ 3 - విద్య సంబంధ స్పామ్స్‌

బ్లాక్‌ 4 - హెల్త్‌

బ్లాక్‌ 5 - కన్జూమర్‌

బ్లాక్‌ 6 - కమ్యూనికేషన్‌/ బ్రాడ్‌కాస్టింగ్‌

బ్లాక్‌ 7 - టూరిజం, లీజర్‌

బ్లాక్‌ 8 - ఫుడ్‌ అండ్‌ బెవరేఎస్‌యాప్స్‌, వెబ్‌సైట్స్‌కు సంబంధించి జియో చందాదారులు

మై జియో యాప్‌ని ఓపెన్‌ చేయాలి.

మెనూపై టాప్‌, ‘ప్రొఫైల్‌ అండ్‌ అదర్‌ సెట్టింగ్స్‌’ని ఎంపిక చేసుకోవాలి.

‘డూ నాట్‌ డిస్టర్బ్‌ - సెట్‌ ప్రిఫరెన్స్‌ని టాప్‌ చేయాలి.

బ్లాక్‌ స్పామ్‌ కాల్స్‌కు సంబంధించి ప్రాధాన్యాల ఆధారంగా ఎంపిక చేసుకోవాలి.

ఎయిర్‌టెల్‌ చందాదారులు

ఎయిర్‌టెల్‌ డిఎన్‌డి వెబ్‌సైట్‌ https://www.aitel.in/airteldnd/ ను సందర్శించాలి.

ఎయిర్‌టెల్‌కు చెందిన డూ నాట్‌ డిస్టర్బ్‌ రిజిస్ట్రీలో మొబైల్‌ నంబర్‌ని రిజిస్టర్‌ చేసుకోవాలి.

ఫోన్‌కు వచ్చిన ఓటీపీ ని ఎంటర్‌ చేయాలి.

ఏయే కేటగిరీల నుంచి స్పామ్‌ కాల్స్‌, మెసేజ్‌లు వద్దనుకుంటున్నారో వాటిని ఎంపిక చేసుకోవాలి.

వొడాఫోన్‌ చందాదారులు

సంబంధిత వెబ్‌సైట్‌ని https://www.myvi.in/dnd పెన్‌ చేయాలి.

మొబైల్‌ నంబర్‌ కొట్టి సబ్మిట్‌ చేయాలి.

ఏయే కేటగిరీల నుంచి స్పామ్‌ కాల్స్‌, మెసేజ్‌లు వద్దనుకుంటున్నారో వాటిని ఎంపిక చేసుకోవాలి.

బీఎ్‌సఎన్‌ఎల్‌ చందాదారులు

స్టార్‌ డిఎన్‌డి అని 1909 కి టెక్స్ట్‌ మెసేజ్‌ పంపాలి.

అప్పుడు మల్టిపుల్‌ ఆప్షన్స్‌ వస్తాయి. అందులో వద్దని అనుకున్నవి బ్లాక్‌ చేయాలి.

అసలీ వ్యవహరం ఎలా అంటే...?

సోషల్‌ మీడియా, వెబ్‌ సెర్చ్‌, డైరక్టరీల నుంచి ఈ స్పామ్‌ కాల్స్‌ చేసే వారు నంబర్లు సేకరిస్తారు. ఇక మోసాలకు పాల్పడే వ్యక్తులు నంబర్లను వెబ్‌-స్ర్కాపింగ్‌ టెక్నిక్స్‌ ఉపయోగించి సంగ్రహిస్తారు.

కొనుగోళ్ళు అలాగే వారంటీ కార్డులపై రాసే నంబర్లను టెలీమార్కెటర్లు కలెక్ట్‌ చేస్తారు. ఆన్‌లైన్‌లో సైతం ట్రాక్‌ చేస్తుంటారు.

ఇండియాలో వరకు 1909 నంబర్‌కు ఫుల్లీ బ్లాక్‌ అని టెక్స్ట్‌ చేయడం ద్వారా స్పామ్‌ కాల్స్‌ బాధ తప్పించుకోవచ్చు.

ఇండియాలో ఆండ్రాయిడ్‌ ఫోన్‌ విషయానికి వస్తే, మొబైల్‌లో సంబంధిత యాప్‌ ఓపెన్‌ చేయాలి. టాప్‌ మోర్‌ - సెట్టింగ్స్‌ - స్పామ్‌ అండ్‌ కాల్‌ స్ర్కీన్‌

సీ కాలర్‌ అండ్‌ స్పామ్‌ ఐడీకి టర్న్‌ కావాలి.

Updated Date - 2023-02-24T23:40:48+05:30 IST