Clothes Color: కొత్తగా కొన్న దుస్తుల కలర్ పోతోందా..? ఉతికేటప్పుడు ఇలా చేయండి చాలు.. రంగు అస్సలు పోదు..!
ABN , First Publish Date - 2023-06-27T12:12:58+05:30 IST
దీనికి చల్లని నీరు తీసుకోవాలి. ఈ నీటిలో దుస్తులు కనీసం రెండు గంటల పాటు నాననివ్వండి.
చాలా ఇష్టపడి, బోలెడు డబ్బుపోసి కొన్న డ్రస్ ఒక్కసారి ఉతికేసరికే రంగు పోయిందనుకోండి. చాలా బాధేస్తుంది. ఏంటిది ఇలా అయిందని తెగ బాధపడిపోతాం. అదే సరిగా ఉతికి ఉంటే బావుండేదని పదే పదే అనుకుంటాం. వేసవి కాలంలో కాటన్ దుస్తులు చాలా సౌకర్యాన్ని ఇస్తాయి.చెమటను పీల్చుకుని చల్లదనాన్ని ఇచ్చేది కాటన్ దుస్తులే. అయితే ఈ కాటన్ వేడి, తేమ కారణంగా విపరీతంగా చెమటలు పట్టడం మూలంగా రంగు మారిపోతాయి. ఇలా కొత్త దుస్తులు పాడైపోతుంటే వాటిని కలర్ పోకుండా ఎలా ఉతకాలో తెలుసుకుందాం.
రంగుమారడాన్ని ఆపడం ఎలా?
1. దీని కోసం బకెట్ లేదా టబ్‌లో పది నుండి పన్నెండు లీటర్ల నీరు తీసుకోండి.
2. ఈ నీటిలో ఒక చిన్న పటిక, రెండు దోసిళ్ళ ఉప్పు కలపాలి. దీనికి చల్లని నీరు తీసుకోవాలి. ఈ నీటిలో దుస్తులు కనీసం రెండు గంటల పాటు నాననివ్వండి.
ఇది కూడా చదవండి: ఖాళీ దొరికితే చాలు వేళ్లను విరుచుకునే అలవాటుందా..? దీని వల్ల జరిగేదేంటో డాక్టర్లు చెబుతున్న నిజాలివీ..!
3. రెండు గంటల తర్వాత నీళ్లలోంచి దుస్తులను ఒక్కొక్కటిగా తీసి శుభ్రమైన నీటిలో నానబెట్టి ఉతకాలి. కొన్ని దుస్తులు ఆ సమయంలో రంగు వదిలివేయవచ్చు కానీ మళ్లీ ఉతికినప్పుడు మాత్రం రంగు వదలవు.
పెళుసుదనం పోవాలంటే ఏం చేయాలి?
ఈ ప్రక్రియను చేసిన తర్వాత, బట్టలు కొంచెం గట్టిగా అంచే పెళుసుగా మారతాయి. దుస్తులు పెళుసుదనం పోయి మృదువుగా మారడానికి ఒక బకెట్ లో వెనిగర్ వేసి, ఈ వెనిగర్ నీటిలోదుస్తులను నానబెట్టి వాటిని తీసి ఆరబెట్టాలి.