Director K. Raghavendra Rao : ప్రతిభావంతుల అన్వేషణలో..

ABN , First Publish Date - 2023-02-04T04:40:21+05:30 IST

దర్శకుడిగా కె.రాఘవేంద్రరావుది తిరుగులేని ప్రయాణం. ఎంతోమంది నూతన నటీనటుల్ని వెండి తెరపైకి తీసుకొచ్చారు. స్టార్లుగా మార్చారు. ఇప్పటికీ ఆయన ప్రతిభావంతుల కోసం అన్వేషిస్తూనే ఉన్నారు. కె.ఆర్‌.ఆర్‌

Director K. Raghavendra Rao :  ప్రతిభావంతుల అన్వేషణలో..

దర్శకుడిగా కె.రాఘవేంద్రరావుది తిరుగులేని ప్రయాణం. ఎంతోమంది నూతన నటీనటుల్ని వెండి తెరపైకి తీసుకొచ్చారు. స్టార్లుగా మార్చారు. ఇప్పటికీ ఆయన ప్రతిభావంతుల కోసం అన్వేషిస్తూనే ఉన్నారు. కె.ఆర్‌.ఆర్‌ వర్క్స్‌ పేరుతో ఓ యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించారు రాఘవేంద్రరావు. ఎస్‌.ఎ్‌స.రాజమౌళి చేతుల మీదుగా ఈ ఛానల్‌ శ్రీకారం చుట్టుకొంది. ‘‘రాఘవేంద్రరావు గారి తపన ఆగలేదు. ఇంకెంతోమందికి అవకాశాలు ఇవ్వాలనే సంకల్పంతో ఈ యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించారు. ఎనభై ఏళ్ల యువ దర్శకుడికి శుభాకాంక్షలు’’ అన్నారు రాజమౌళి. ఈ ఛానల్‌ ద్వారా కొత్త వారికి అవకాశం ఇస్తామని, రచయితలు, నటీనటులు, దర్శకుల్ని ప్రోత్సహించడానికే ఈ ఛానల్‌ ఏర్పాటు చేశామని రాఘవేంద్రరావు తెలిపారు.

Updated Date - 2023-02-04T04:40:23+05:30 IST