Wife-Husband: మగాళ్లలో ఈ నాలుగు లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా.. భార్యతో గొడవలు జరుగుతున్నాయనే అర్థం..!

ABN , First Publish Date - 2023-07-11T14:25:15+05:30 IST

అందుకే వీళ్ళు తమ సంతోషాన్ని, బాధను వ్యక్తం చేసే విధానం కూడా చాలా భిన్నంగా ఉంటుంది.

Wife-Husband: మగాళ్లలో ఈ నాలుగు లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా.. భార్యతో గొడవలు జరుగుతున్నాయనే అర్థం..!
relationship problems .

ఆలోచనల్లోనూ, ఆచరణలోనూ పురుషులు, మహిళలు మానసికంగా ఒకరికొకరు చాలా భిన్నంగా ఉంటారనడంలో సందేహం లేదు. అందుకే వీళ్ళు తమ సంతోషాన్ని, బాధను వ్యక్తం చేసే విధానం కూడా చాలా భిన్నంగా ఉంటుంది. మహిళలు తమ భావాలను బహిరంగంగా వ్యక్తం చేస్తారు. బాధలో గుండెలవిసేలా ఏడుస్తారు కూడా, ఆనందం వచ్చిందంటే మాత్రం గట్టిగా నవ్వుతారు. కానీ మగవారు ఇలా కాదు తమ సంతోషాలను, బాధలను తమలోనే ఉంచుకుంటారు. ముఖ్యంగా వారి మనసులో ఏం జరుగుతుందో కనుక్కోవడం చాలా కష్టం.

ఇద్దరు కలిపి సంసార బంధంలో కలిసి నడుస్తున్నారంటే దానికి ప్రేమ, ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి నమ్మకం, ఇష్టం, బాధ్యత కావాలి. ఇందులో ఏది లోపించినా కూడా ఆ సంబంధం విచ్ఛిన్నం కావడం మామూలుగా జరిగేదే.. కానీ భాగస్వామి మీద ఇష్టం లేదని చెప్పడానికి కష్టపడుతూ లోపలే దాచుకునే పురుషులు ఈ సంబంధాన్ని తెంచుకోలేక ఎలా ప్రవర్తిస్తారనేది తెలుసుకుందాం.

సరిగా స్పందించలేకపోవడం..

భాగస్వామితో ఏదైనా చర్చించడం మొదలుపెట్టినప్పుడు అది తప్పని కానీ, ఒప్పని కానీ ఎలాంటి వాదనలు చేయకుండా వాదనలకు దిగకుండా ఎక్కువ మౌనంగా ఉంటున్నారంటే అతనికి తన బంధంలో సంతోషం లేదనే అర్థం.

ఇది కూడా చదవండి: పొరపాటున కూడా స్నాక్స్‌ను ఈ టైమ్ తర్వాత అస్సలు తినొద్దు.. శాస్త్రవేత్తలే ఎందుకిలా చెప్పారంటే..!

సరిగా మాటకలపకపోవడం..

మాట కలపకపోవడం, దూరం దూరంగా ఉండటం కూడా కలిసి ఉండటం ఇష్టం లేదని చెప్పడమే. ఇది ఎదుటివారిని చాలా నిరాశపరుస్తుంది.

పనుల మీద అధికంగా దృష్టి పెట్టడం..

కలిసి ఉండటం ఇష్టం లేదని చెప్పలేని వారు, రోజూ చేసే పనుల్లోనో వేరే వ్యాపకాలలోనో బిజీ అవుతూ ఉంటారు. అభిరుచులలో మునిగిపోతారు. దీనితో భాగస్వామితో పంచుకునే బాధ్యతల నుంచి సులభంగా తప్పించుకుంటారు. బంధంలో అసంతృప్తికి ఇవన్నీ చిహ్నాలుగా ఉంటాయి.

ఇక మగవారికి బంధంలో సంతోషంగా లేనప్పుడు, మగవారు తమ భాగస్వామి మాటలను వినడానికి ఇష్టపడరు. చిన్న విషయాలకే పదే పదే విమర్శించడం మొదలుపెడతారు. ఒక్కోసారి అసభ్యకర వ్యాఖ్యలు కూడా చేస్తుంటారు. ఈ ప్రవర్తన చాలా సమయాలలో నిరాశ, అసంతృప్తి కలిగిస్తుంది. తన అసంతృప్తిని గురించి భాగస్వామితో ఎలా మాట్లాడాలి అనేది అర్థం కాక తన వింత ప్రవర్తనతో దాన్ని వ్యక్తీకరించే ప్రయత్నం చేస్తారు.

ఇతరులతో ఎక్కువ సమయం గడుపుతారు.

సమస్య ఉన్నప్పుడు, భాగస్వాములు ఒకరితో ఒకరు సమయం గడపాలని, బహిరంగంగా మాట్లాడాలని సాధారణంగా నమ్ముతారు. కానీ మగవారు దీనికి విరుద్ధంగా తన భాగస్వామికి బదులుగా, బయటి వ్యక్తులతో ఎక్కువ సమయం గడుపుతారు, ఎదుటివారి నుంచి జాలిని, ప్రేమను కోరుకుంటారు. చాలా సందర్భాల్లో ఇది అక్రమసంబంధాలకు కూడా దారితీస్తుంది.

Updated Date - 2023-07-11T14:25:15+05:30 IST