Microsoft 3D Emojis: మైక్రోసాఫ్ట్‌ నుంచి 3డి ఎమోజీలు

ABN , First Publish Date - 2023-07-14T23:07:45+05:30 IST

మైక్రోసాఫ్ట్‌ ఎట్టకేలకు సరికొత్త 3డీ ఎమోజీలను విడుదల చేసింది. వీటిని రిలీజ్‌ చేస్తున్నట్టు మైక్రోసాఫ్ట్‌ రెండేళ్ళ క్రితమే ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది.

Microsoft  3D Emojis: మైక్రోసాఫ్ట్‌ నుంచి  3డి ఎమోజీలు

మైక్రోసాఫ్ట్‌ ఎట్టకేలకు సరికొత్త 3డీ ఎమోజీలను విడుదల చేసింది. వీటిని రిలీజ్‌ చేస్తున్నట్టు మైక్రోసాఫ్ట్‌ రెండేళ్ళ క్రితమే ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ అప్డేట్‌తో ఎమోజీల కలర్‌ డిస్‌ప్లే చాలా రిచ్‌గా ఉంటుందని మైక్రోసాప్ట్‌ ఒక బ్లాగ్‌పోస్టులో తెలిపింది. త్రీడీతో దర్శనమిచ్చే ఈ ఎమోజీలు అతి త్వరలోనే కొన్ని యాప్స్‌, బ్రౌజర్లను చేరనున్నాయి. దీంతో కమ్యూనికేషన్‌లో ఎక్స్‌ప్రెషన్‌ మరింత మెరుగ్గా ఉంటుంది. మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌ గతేడాది గ్రేడియంట్‌ స్టయిల్‌తో రూపొందించి 3డి ఎఫెక్ట్‌ ఎమోజీలను విడుదల చేసింది. ఇటీవలి ప్రదర్శించిన ఎమోజీలకు కూడా వాటితో పోలికలు ఉండటం విశేషం. విండోస్‌ ఇన్‌సైడర్‌ ప్రోగామ్‌కు సైనప్‌ అయితే చాలా త్వరగా వీటిని పొందవచ్చు. లేదంటే అవి విడుదలయ్యే వరకు అందరితోపాటు ఆగాల్సిందే.

Updated Date - 2023-07-14T23:07:45+05:30 IST