Gas Stove: గ్యాస్ స్టవ్ బర్నర్.. ఇలా నల్లగా మారిపోయిందా..? ఏముందిలే అని ఎవరూ పట్టించుకోరులే కానీ..!

ABN , First Publish Date - 2023-09-08T12:56:41+05:30 IST

బర్నర్‌ను రాత్రంతా డ్రింక్‌లో నానబెట్టి, అలాగే వదిలేయండి. ఉదయాన్నే బయటకు తీస్తే పూర్తిగా మెరుస్తూ ఉంటుంది.

Gas Stove: గ్యాస్ స్టవ్ బర్నర్.. ఇలా నల్లగా మారిపోయిందా..? ఏముందిలే అని ఎవరూ పట్టించుకోరులే కానీ..!
completely shining

వంటగది ఎప్పుడూ మెరుస్తూ ఉండాలంటే శుభ్రంగా ఉంచడం అవసరం. అందులో అతి ముఖ్యమైన భాగం గ్యాస్ స్టవ్. ఎందుకంటే తరచుగా ఉపయోగించడం, చిన్నగా శుభ్రపరచడం వలన, పేరుకున్న మురికి పొర తొలగిపోతుంది. లేదంటే చిన్న గ్యాప్‌లో అయినా సరే దానిపై మురికి, జిడ్డు పేరుకుపోతుంది. అంతే కాకుండా గ్యాస్ మంట, దానిపై పడిన ఆహార పదార్థాలు బొగ్గులా నల్లగా కనిపిస్తాయి. తక్కువ సమయంలో గ్యాస్ స్టవ్, బర్నర్ మెరుస్తూ ఉండడానికి కొన్ని ఇంటి చిట్కాలను తెలుసుకుందాం.

గ్యాస్ స్టవ్ పై తుప్పు తొలగించడానికి వెనిగర్ ఎలా ఉపయోగించాలి..

మొండి మరకలు, తుప్పు పట్టడం. అటువంటి పరిస్థితిలో, గ్యాస్ స్టవ్, బర్నర్‌పై తుప్పు, మురికి, నల్లని జిగట పొరను తొలగించడానికి, దానిపై వెనిగర్‌ను వేయండి. స్టవ్ బర్నర్‌లపై టిష్యూ పేపర్‌ను పరచి, వెనిగర్‌ను మరోసారి స్ప్రే చేయండి. 1 గంట అలాగే ఉంచిన తర్వాత, చిన్న వస్త్రంతో తుడిచి శుభ్రం చేయండి.

ఇలా కాలిన మరకలను తొలగించండి:

గ్యాస్ జ్వాల కారణంగా బర్నర్, దాని ప్లేట్ నల్లబడడం సాధారణ విషయమే కావచ్చు కానీ.. దానిని శుభ్రం చేయడానికి వెనిగర్, బేకింగ్ సోడాను పేస్ట్ చేసి, 10 నుంచి 15 నిమిషాలు బర్నర్ స్టవ్ మీద బాగా ఉంచండి. తర్వాత స్క్రబ్బర్‌తో రుద్ది శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల గ్యాస్ స్టవ్ మొత్తం కొత్తగా మెరుస్తుంది.

ఇది కూడా చదవండి: రోజూ పొద్దున్నే అస్సలు నిద్ర లేవలేకపోతున్నారా..? ఈ 10 రకాల వ్యాధుల్లో ఏదైనా కారణం కావచ్చు..!


బర్నర్ తుప్పుతో ఉంటే..

గ్యాస్ స్టవ్ బర్నర్లో తుప్పు తొలగించడానికి డ్రింక్ లాంటి పానీయాన్ని ఉపయోగించవచ్చు. దీని కోసం, బర్నర్‌ను రాత్రంతా డ్రింక్ లో నానబెట్టి, అలాగే వదిలేయండి. ఉదయాన్నే బయటకు తీస్తే పూర్తిగా మెరుస్తూ ఉంటుంది.

ఈ పద్ధతితో..

గ్యాస్ స్టవ్ బర్నర్ ఇత్తడితో చేసినట్లయితే, నిమ్మరసం మెరుస్తూ ఉండటానికి సహాయపడుతుంది. దీని కోసం, నిమ్మ చెక్కలను వేడి నీటిలో ఉడకబెట్టండి. బర్నర్‌ను రాత్రంతా అందులో నానబెట్టండి. ఉదయాన్నే నిమ్మతొక్కపై ఉప్పు రాసి రుద్దితే కొత్తగా మెరుస్తుంది.

Updated Date - 2023-09-08T12:56:41+05:30 IST