Home Accessories: తాజా పూల మొక్కలు, ఫ్లాస్టిక్ పూల మొక్కలు వీటిలో ఏవి ఇంటి అలంకరణకు సరిపోతాయి..!
ABN , First Publish Date - 2023-04-13T14:58:53+05:30 IST
పూల అలంకరణ కన్నా పూల మొక్కలు, పూల గుత్తులతో అలంకరించిన ఇళ్ళు మరింత అందంగా కనిపిస్తాయి.
అందం, తాజాదనాన్ని ఇచ్చే పువ్వులను ఎక్కడ అలంకరించినా అందం దానంతట అదే వస్తుంది. అయితే ఎలాంటి పూలను అలకరిస్తే ప్రత్యేకంగా కనిపిస్తాయి. పూల అలంకరణ కన్నా పూల మొక్కలు, పూల గుత్తులతో అలంకరించిన ఇళ్ళు మరింత అందంగా కనిపిస్తాయి. అయితే ఎక్కడ ఏది ఉంచితే ప్రత్యేకంగా ఉంటుంది మరింత అందం వస్తుందో కూడా తెలియాలి.
మొక్కలు ఆనందాన్ని, ప్రశాంతతను కలిగిస్తాయి. ఇంటి ఇంటీరియర్స్ కోసం ఇంటిని పూలతో అలంకరించడం ఎల్లప్పుడూ మంచి ఆలోచనే. ఇంటిని పూలతో అలంకరించడానికి అనేక అసాధారణ మార్గాలు ఉన్నాయి, పూలు పరిసరాలను ప్రకాశవంతం చేస్తాయి. రంగురంగుల పువ్వుల నుండి సువాసనగల మూలికల వరకు, ఇంటి అలంకరణలో పువ్వులను చేర్చడం వల్ల ఆ ప్రదేశానికి తాజా దనాన్ని, కొత్త రూపాన్ని తీసుకువస్తాయి. అయితే తాజాగా ఉన్నప్పుడు ఎంత అందంగా ఉన్నా కాస్త రెండురోజులు పోతే మాత్రం పూలకున్న అందం తగ్గిపోతుంది. అందుకే అంత మార్చే ఓపికలేనివారు, ఫ్లాస్టిక్ పూలను ఎంచుకుంటారు. అయితే తాజా వాటికంటే ప్లాస్టిక్ మొక్కలే నయా ట్రెండ్‌గా మారింది.
1. అవి వాడిపోవు, ఎండిపోవు, చనిపోవు కాబట్టి కృత్రిమ మొక్కలు ఎక్కువకాలం పాటు అందంగా ఉంటాయి.
2.అంతేకాదు ఇవి నిజమైన మొక్కలపై అంచుని కలిగి ఉంటాయి.
3. అంతేకాక, వాటికి నీరు పెట్టే పనిలేదు, కత్తిరింపు, ఫలదీకరణం అవసరం లేదు. ఎక్కువ సంరక్షణ, నిర్వహణ లేకుండా అవి సంవత్సరాలుగా చెక్కుచెదరకుండా ఉంటాయి.
4. అందువల్ల, సమయం తక్కువగా ఉన్నవారికి అవి ఇంటికి సరైన ఛాయిస్ గా ఉంటాయి.
ఇది కూడా చదవండి: అక్షయతృతీయ రోజు అందరూ బంగారం కొనాలనేం లేదు.. బంగారం కొనలేని వాళ్లు ఏం చేయొచ్చంటే..
పూలు, పొదలు, తీగ మొక్కలు ఇంటి పెరట్లో పెంచుకోవచ్చు. ప్రస్తుతం నర్సరీలో రకరకాల మొక్కలు అందుబాటులో ఉన్నాయి. మీ ఇష్టాన్ని బట్టి ఎంపిక చేసుకోవచ్చు. అయితే వీటిని ఇలా సంరక్షించండి.
1. పూల మొక్కలు ఇంటిని చూడటానికి ఆకర్షణీయంగా మారుస్తాయి. వీటిని పెంచుకోవడానికి మట్టి కుండీలు లాంటివి ట్రై చేయండి.
2. మొక్కలకు సరిపడా నీరు పెట్టడం చాలా అవసరం. ఏ మొక్కకు ఎంత నీరుపట్టాలి అనే విషయాన్ని నర్సరీలోనే అడిగి తెలుసుకోవడం ఉత్తమం.
3. మొక్కలు నాటిన వారం రోజులూ నీరు పట్టాలి. రెండోవారంలో రోజు మరుసటి రోజు నీరు పడితే చాలు. మొక్కలు బాగా పెరిగాక వారానికోసారి నీరు పట్టండి. ఈ నిబంధన అన్ని రకాల మొక్కలకు వర్తించదు. కొన్ని మొక్కలకు రోజూ నీరు పట్టాలి.
4. ఎండిపోయిన మొక్కలుంటే వెంటనే తీసేయండి. లేకుంటే అందమైన పూలమొక్కల మధ్యలో అది అందవిహీనంగా కనిపిస్తుంది.
5. వేప నూనె లేదా వేప పిండి కలిపినా లీటర్ నీళ్లను వారానికోసారి పిచికారి చేస్తే మొక్కలకు తెగుళ్లు, వ్యాధులు, పురుగులు పట్టవు.
6. మొక్కలు పెంచేటప్పుడు దానికి ఎటువంటి మట్టి అవసరమో నర్సరీలో అడిగి తెలుసుకోండి.