Biryani Rice: మార్కెట్లో కొన్న బిర్యానీ రైస్.. అసలుదో.. నకిలీదో.. ఈ రెండు టిప్స్‌తో కనిపెట్టేయండి..!
ABN , First Publish Date - 2023-07-14T11:53:48+05:30 IST
బిర్యానీ చేసేటప్పుడు మెరినేషన్‌లో ఉపయోగించే పెరుగు పరిమాణం ఎక్కువగా ఉండకూడదు,
బిర్యానీ చేయాలని నిర్ణయించుకున్నాకా, మామూలు బియ్యంతో తయారు చేస్తే అది బిర్యానీ అందాన్ని, రుచిని తీసుకురాదని బిర్యానీకి ప్రత్యేకమైన రైస్ ని ఎంచుకుంటాం. ఈ బాస్మతీ రైస్ ని ఎంచుకుంటాం. నిజానికి బాస్మతీ రైస్ బిర్యానీ రుచిని, చూసేందుకు అందాన్ని కూడా పెంచుతుంది. రుచికరంగా ఉండటమే కాకుండా చేతులకు అంటుకోకుండా పొడి పొడి ఉంటుంది. ఇంకో నాలుగు ముద్దలు ఎక్కువ లాగించేయాలనేంతలా నోరూరిస్తుంది. అలాంటి బిర్యానీ రైస్ ని నాణ్యత లోపంలేకుండా సరైన బియ్యాన్ని ఎలా ఎంచుకోవాలో మీకు తెలుసా.. బిర్యానీ రైస్ అసలుదో, నకిలీదో ఎలా తెలుసుకోవాలంటే..
బియ్యం గింజ ఎంత పెద్దదైతే అంత పౌష్టికాహారం, రుచిగా ఉంటుందనుకుంటారు. కానీ మనం కొత్త బియ్యాన్ని, పాత బియ్యాన్ని వేరు చేయలేక వాటి మధ్య వ్యత్యాసాన్ని గుర్తించలేక ఇబ్బంది పడతాం. చాలా సార్లు మార్కెట్ నుండి కొత్త బియ్యాన్ని కొంటాము, ఈ బియ్యంతో బిర్యానీ లేదా పులావ్ తయారు చేసినప్పుడు, అది చాలా జిగటగా తయారవుతుంది. దీనివల్ల బిర్యానీ, పులావ్ రుచికరంగా రాదు, అలాగే కనిపించదు. రుచికరంగా బిర్యానీ చేయాలంటే దానికి పాత బియ్యాన్ని ఎంచుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయి.
సరైన బియ్యాన్ని ఎలా గుర్తించాలి..
1.. మంచి బిర్యానీ, పులావ్ చేయడానికి, మనకు పాత బియ్యం అవసరం. ఈ బియ్యం పంట పండి దాదాపు 1 నుండి ఒకటిన్నర సంవత్సరాలు అయితే వాటితో తయారుచేసే వంటకాలు చాలా రుచికరంగా ఉంటాయి. దాన్ని ఎలా గుర్తించాలంటే.. పాత బియ్యంలో కొద్దిగా పసుపు రంగు ఉంటుంది, కొత్త బియ్యం పూర్తిగా తెల్లగా ఉంటాయి. అంతేకాదు, పాత బియ్యాన్ని ముట్టుకుంటే, దాని నుండి కొంత పొడి పదార్థం వస్తుంది, కొత్త బియ్యం చాలా మెత్తగా ఉంటాయి. ఈ కారణంతోనే, వంట తర్వాత బియ్యం జిగటగా మారి ముద్ద కడుతుంది.
ఇది కూడా చదవండి: జుట్టుకో, ముఖానికో రాసుకుని ఉంటారు కానీ.. వేపాకుల పొడిని ఒక్కసారి ఇలా ట్రై చేసి చూస్తే..!
2.. బియ్యాన్ని గుర్తించడానికి రెండో చిట్కా ఎంటంటే.. దీని కోసం, నోట్లో కొన్ని బియ్యం గింజలను వేసుకోవాలి. నమలిన తర్వాత స్ఫుటమైన శబ్దం వస్తే, ఈ బియ్యం పాతవని రుజువు. అలాగే పళ్ల మధ్య బియ్యం అంటుకోవడం ప్రారంభిస్తే అది కొత్త బియ్యానికి గుర్తు. అటువంటి పరిస్థితిలో, బిర్యానీ, పులావ్ చేయడానికి ముందు బియ్యాన్ని కొనుగోలు చేస్తుంటే, వాటి నాణ్యతను పరిశీలించాలి. ఈ 2 విధాలుగా బియ్యాన్ని గుర్తించి సరైన బియ్యాన్ని తెలుసుకోవచ్చు.
అలాగే బిర్యానీ వండేప్పుడు తీసుకోవల్సిన జాగ్రత్తలేంటంటే..
1. బియ్యాన్ని బాగా కడగడం, వండడానికి ముందు బియ్యం గింజలను కనీసం 30 నిమిషాలు నీటిలో నానబెట్టడం కూడా మంచిది. ఇలా చేయడం వల్ల అన్నం మెత్తబడి వండేటప్పుడు నీటిని పీల్చుకోవడానికి వీలు కల్పిస్తుంది.
2. ఈ బియ్యాన్ని అతిగా ఉడకబెట్టవద్దు, సుమారు ఐదు నిమిషాలు ఉడకబెట్టిన తర్వాత చిన్న సెగమీద మంట ఉంచితే సరిపోతుంది.
3. ఈ బియ్యం వండేటప్పుడు అన్నం అంటుకోకుండా ఉండేందుకు నిమ్మరసం ఉపయోగించవచ్చు. దీనివల్ల అన్నం అతుక్కోకుండా ఉండి పొడిగా వస్తుంది.
4. బిర్యానీ చేసేటప్పుడు మెరినేషన్‌లో ఉపయోగించే పెరుగు పరిమాణం ఎక్కువగా ఉండకూడదు, అది బిర్యానీని మెత్తగా మార్చుతుంది.
5. బిర్యానీ కోసం ఎంచుకునే వంట పాత్ర కూడా తగినంత పెద్దదిగా ఉండాలి, దీనివల్ల బియ్యం వండడానికి తగినంత స్థలాన్ని ఉంటుంది.