Kangana : అమీర్‌ఖాన్‌పై కంగన అక్కసు
ABN , First Publish Date - 2023-02-11T23:25:52+05:30 IST
కంగనా రనౌత్... వివాదాలకు కేరాఫ్ అడ్రస్. ఎప్పుడూ ఏదో ఓ హాట్ కామెంట్‌తో వార్తల్లో ఉంటుంది. మనసులో ఏదీ దాచుకోదు. ఎదుట ఉన్నది
కంగనా రనౌత్... వివాదాలకు కేరాఫ్ అడ్రస్. ఎప్పుడూ ఏదో ఓ హాట్ కామెంట్‌తో వార్తల్లో ఉంటుంది. మనసులో ఏదీ దాచుకోదు. ఎదుట ఉన్నది ఎంతటి వ్యక్తి అయినా సరే.. మాటల తూటాలు వదిలేస్తుంటుంది. ఈసారి... అమీర్‌ఖాన్‌ని టార్గెట్ చేసింది కంగనా. ప్రముఖ రచయిత్రి శోభా డే రాసిన ఓ పుస్తకఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు అమీర్ ఖాన్. ఈ సందర్భంగా ‘శోభా డే బయోపిక్ గనుక తీస్తే.. ఆ పాత్రకు ఎవరు న్యాయం చేయగలరు?’ అనే ప్రశ్న అమీర్‌ఖాన్‌కు ఎదురైంది. దానికి సమాధానమిస్తూ ‘‘ప్రియాంకా చోప్రా, దీపికా పదుకొణె, అలియాభట్.. ఈ ముగ్గురూ అద్భుతమైన నటీమణులు. వీళ్లు తప్ప మరో పేరు గుర్తుకు రావడం లేద’’న్నారు. ఆ పక్కనే ఉన్న శోభా ‘‘కంగనా రనౌత్ కూడా న్యాయం చేయగలదు’’ అనేసరికి.. అమీర్‌ఖాన్ ‘‘అవును.. ఆమె కూడా మంచి నటి’’ అని ముక్తాయించారు. ఈ సమాధానంతో కంగనా సంతృప్తి చెందలేదు. ‘‘పాపం.. అమీర్.. మూడుసార్లు జాతీయ అవార్డు సంపాదించిన నా పేరుని చెప్పకుండా బాగా కష్టపడాల్సి వచ్చింది’’ అంటూ నేరుగా అమీర్‌పై కౌంటర్ వేశారు. తన పేరు ప్రస్తావించిన శోభాకు ధన్యవాదాలు తెలియజేశారు. ‘‘శోభాతో నాకు కొన్ని విషయాల్లో వైరుథ్యాలు ఉన్నాయి. అయినప్పటికీ ఆమె నన్ను గుర్తించారు. అది ఆమె గొప్పదనానికి నిదర్శనం’’ అంటూ వ్యాఖ్యానించారు.