Life Skills : ‘నో’... నాజూకుగా
ABN , First Publish Date - 2023-01-07T00:03:19+05:30 IST
నచ్చనిది నచ్చలేదని చెప్పడానికి కొందరికి మొహమాటం అడ్డొస్తుంది. ఎదుటి వాళ్లకు నచ్చకుండాపోతామేమోననే భయం కూడా కొందర్లో ఉంటుంది. దాంతో ‘నో’ చెప్పడానికి
నచ్చనిది నచ్చలేదని చెప్పడానికి కొందరికి మొహమాటం అడ్డొస్తుంది. ఎదుటి వాళ్లకు నచ్చకుండాపోతామేమోననే భయం కూడా కొందర్లో ఉంటుంది. దాంతో ‘నో’ చెప్పడానికి తటపటాయిస్తూ ఉంటారు. కానీ ఈ స్వభావంతో ఇబ్బందులు పడేకంటే, ఖరాఖండిగా ‘నో’ చెప్పడం ఇలా నేర్చుకోవాలి.
ఐడియా బాగుంది. కానీ నేను అందుబాటులో ఉండకపోవచ్చు అని చెప్పవచ్చు.
నన్ను అడగాలని మీకు అనిపించినందుకు సంతోషం. కానీ నేనా పని చేయలేను.
ఐయామ్ సారీ, నేనిప్పుడు అంత సహాయం చేసే పరిస్థితిలో లేను.
పరిస్థితి అనుకూలంగా లేదు. మరోసారి ఆలోచిద్దాం!
నన్నే అడగాలని మీకు అనిపించినందుకు సంతోషం. కానీ ఇప్పుడు నేనందుకు సిద్ధంగా లేను. నేనిప్పుడు అందుబాటులో లేను. మరోసారి చూద్దాం! నో థ్యాంక్స్!