Boost Immunity: ఇమ్యూనిటీని పెంచుదాం

ABN , First Publish Date - 2023-03-20T22:30:04+05:30 IST

వ్యాధులు, ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ పొందాలంటే వ్యాధినిరోధకశక్తిని మెరుగ్గా ఉంచుకోవాలి.

Boost Immunity: ఇమ్యూనిటీని పెంచుదాం

లైఫ్‌స్టైల్‌

వ్యాధులు, ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ పొందాలంటే వ్యాధినిరోధకశక్తిని మెరుగ్గా ఉంచుకోవాలి. వ్యాధినిరోధకశక్తిని బలపరుచుకోవడానికి ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడంతో పాటు, కొన్ని ఆరోగ్య సూత్రాలు కచ్చితంగా పాటించాలి!

ఒత్తిడితో జీర్ణవ్యవస్థలో లోపాలు, హృద్రోగాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అంతటి తీవ్ర రుగ్మతలకు పరోక్షంగా కారణమయ్యే ఒత్తిడి, వ్యాధినిరోధకశక్తిని కూడా కుంటుపరుస్తుంది. అయితే ఒత్తిడి ఎంతో కొంత ఉండడం సామర్థ్య నిరూపణకు అవసరమే! అయితే ఆ ఒత్తిడి తీవ్రత, కొనసాగే కాలాలను బట్టి, దాని ప్రభావం వ్యాధినిరోధకశక్తి మీద పడుతుంది. అలాగే ఒత్తిడి అందరిలోనూ ఒకేలా, సమానంగా ఉండకపోవచ్చు. ఒత్తిడికి లోను చేసే విషయాల్లో కూడా వ్యక్తుల మధ్య తేడాలు ఉండవచ్చు. కాబట్టి జీవన నాణ్యతను దెబ్బతీసేలా ఉంటే, ఆ ఒత్తిడి కచ్చితంగా వ్యాధినిరోధకశక్తిని కుంటుపరుస్తుందనే విషయాన్ని గ్రహించాలి. కాబట్టి అలాంటి ఒత్తిడికి దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి.

ఆరోగ్య సూత్రాలు!

పళ్లు, కూరగాయలు పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవాలి.

క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.

శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి.

సరిపడా నిద్ర తప్పనిసరి.

ఒత్తిడిని తగ్గించుకోవాలి.

శరీర శుభ్రత పాటించాలి.

Updated Date - 2023-03-20T22:30:04+05:30 IST