Share News

Manchu Manoj : తండ్రి కాబోతున్న మంచు మనోజ్‌

ABN , Publish Date - Dec 17 , 2023 | 05:55 AM

అభిమానులకు హీరో మంచు మనోజ్‌ ఓ శుభవార్త చెప్పారు. తన సతీమణి మౌనిక త్వరలో తల్లి కాబోతున్నట్లు శనివారం ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు.

Manchu Manoj : తండ్రి కాబోతున్న మంచు మనోజ్‌

అభిమానులకు హీరో మంచు మనోజ్‌ ఓ శుభవార్త చెప్పారు. తన సతీమణి మౌనిక త్వరలో తల్లి కాబోతున్నట్లు శనివారం ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు. తన అత్తయ్య శోభా నాగిరెడ్డి జయంతిని పురస్కరించుకుని మనోజ్‌ ఈ విషయం వెల్లడించారు. ఈ సంతోషకరమైన సమయంలో అందరి ఆశీస్సులు తమకు ఉండాలని ఆయన కోరారు. ఈ ఏడాది మార్చిలో మనోజ్‌, మౌనికల వివాహం జరిగింది. ప్రస్తుతం ‘ఉస్తాద్‌’ అనే సెలబ్రిటీ గేమ్‌ షో కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న మనోజ్‌ త్వరలో ‘వాట్‌ ది ఫిష్‌’ చిత్రంలో నటించనున్నారు. వరుణ్‌ దేవరకొండ ఈ చిత్రానికి దర్శకుడు.

Updated Date - Dec 17 , 2023 | 05:55 AM