New logo : ఫైండ్ మై డివైజెస్‌కు కొత్త లోగో
ABN , First Publish Date - 2023-09-16T04:56:19+05:30 IST
గూగుల్ - ఫైండ్ మై డివైజ్ ఫీచర్‌కు కొత్తగా అప్డేట్‌ను విడుదల చేస్తోంది. ఇది ఆండ్రాయిడ్ యూజర్లకు ఉద్దేశించినది. 2.5 నుంచి 3.0 వెర్షన్‌కు మారుతోంది. దీంతో
గూగుల్ - ఫైండ్ మై డివైజ్ ఫీచర్‌కు కొత్తగా అప్డేట్‌ను విడుదల చేస్తోంది. ఇది ఆండ్రాయిడ్ యూజర్లకు ఉద్దేశించినది. 2.5 నుంచి 3.0 వెర్షన్‌కు మారుతోంది. దీంతో ఈ టూల్‌కి కొత్త లోగో సమకూరుతోంది. నాలుగు గూగుల్ కలర్స్‌కు తోడు బ్లూ, గ్రీన్ షేడ్స్ దీనికి ఉంటాయి. ఇది ఒకరకంగా రాడార్‌ను తలపిస్తుంది. భవిష్యత్తులో బ్లూటూత్ ట్రాకర్ ఫీచర్ కూడా రానుంది. గూగుల్ ప్లే సర్వీసెస్‌లో బేటా రిలీజ్‌గా కనిపిస్తుంది. ఫైండ్ మై డివైజెస్‌కు సంబంధించి అప్డేటెడ్ వెర్షన్ 3.0 గూగుల్ ప్లే సర్వీసెస్‌లో ఆండ్రాయిడ్ యాప్స్‌కు లభ్యమవుతుంది. గూగుల్ ఇటీవలే ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ట్రాకర్ అలెర్ట్స్ ఫీచర్‌ను జోడించింది. గుర్తించలేని ఎయిర్‌ట్యాగ్స్‌ను డిటెక్ట్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. తద్వారా డివైజ్ మానిటరింగ్‌లో లేకుండా చూస్తుంది.