Mirror: ఆ అద్దమేకదా అనుకున్నారో.. వచ్చే ఫలితాలు చాలా తీవ్రంగా ఉంటాయట. అసలు అద్దాన్ని ఇంట్లో ఎక్కడ పెట్టాలంటే..!
ABN , First Publish Date - 2023-03-18T09:24:11+05:30 IST
దీనివల్ల ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం పడకుండా ఉంటుంది.
వాస్తు ప్రకారం ఏ వస్తువైనా సరైన దిక్కులో ఉంచాలి. ఇలా చేయడం వల్ల చాలా మంచి ఫలితాలను అందుకోవచ్చు. నిజానికి చిన్న వస్తువులను ఇంట్లో మనకు నచ్చినట్టు పెట్టేస్తూ ఉంటాం. అలాగే రోజూ ముఖం చూసుకునే అద్దాన్ని కూడా వాస్తు ప్రకారం ఇంట్లో ఉంచాలని వాస్తునిపుణులు అంటున్నారు. ఆ అద్దమేకదా అనుకున్నారో.. వచ్చే ఫలితాలు చాలా తీవ్రంగా ఉంటాయట.
వాస్తు ప్రకారం అద్దం సానుకూల, ప్రతికూల శక్తులను ప్రభావితం చేస్తుంది. మీకు తెలుసా.. అద్దాన్ని ఇంట్లో సరైన స్థానంలో ఉంచడం వల్ల అది అదృష్టం పెరగడానికి కారణం అవుతుంది. అనారోగ్యానికి అద్దం స్థానం మారడం కారణమేనట.. అద్దాన్ని ఉత్తర దిక్కులో ఉంచాలి.
ఎందుకంటే ఆ దిక్కు కుబేరుని స్థానం. ఆ దిక్కులో అద్దం పెడితే సానుకూల ప్రభావంతో పాటు కుబేరుడు ప్రీతి చెందుతాడు. అంతే కాదు ధనలాభం, వ్యాపార వృద్ధి ఉంటుంది. అంతే కాదు ఆఫీస్, కార్యాలయాల్లో అయితే అద్దాన్ని ఉత్తర దిక్కులో పెట్టడం వల్ల వ్యాపార వృద్ధి ఉంటుంది. ఏదో పెట్టాంలే అనిపించుకోకుండా అద్దాన్ని శుభ్రంగా మెరిసేలా తుడుస్తూ ఉండాలి. దీనివల్ల ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం పడకుండా ఉంటుంది.
ఇది కూడా చదవండి: ఇంట్లో డబ్బుకు లోటుండకూడదంటే.. ఇలా చేయండి.
అలాగే పగిలిన అద్దాన్ని పగుళ్ళు తేలిన అద్దాన్ని ఇంట్లో ఉంచడం కూడా దురదృష్టాన్ని కొని తెచ్చుకున్నట్టే.. ఇంకో విషయం ఏంటంటే గదిలో ఉంచిన అద్దం నాలుగు నుంచి ఐదు అడుగుల ఎత్తులో ఉంచడం వల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. మీ ఇంట్లో అద్దం ఏ దిక్కులో ఉందో చెక్ చేయండి మరి..