Bhartrihari: అతడే మంచి మిత్రుడు
ABN , First Publish Date - 2023-02-09T23:09:40+05:30 IST
పాపాన్నివారయతి, యోజయతే హితాయ గుహ్యం నిగూహతి, గుణాన్ ప్రటీకరోతి ఆపద్గతం చ న జహాతి దదాతి కాలే సన్మిత్ర లక్షణ మిదం ప్రదన్తి సంతః
సుభాషితం
పాపాన్నివారయతి, యోజయతే హితాయ గుహ్యం నిగూహతి, గుణాన్ ప్రటీకరోతి ఆపద్గతం చ న జహాతి దదాతి కాలే సన్మిత్ర లక్షణ మిదం ప్రదన్తి సంతః
మంచి స్నేహితుడికి ఉండే లక్షణాలు ఏమిటో ఈ సుభాషితంలో భర్తృహరి వివరించాడు.
దాన్ని తెలుగులోకి ఏనుగు లక్ష్మణ కవి ఇలా అనువదించాడు.
అఘము వలన మరల్చు, హితార్థ కలితుం
జేయు, గోప్యంబు దాచు, బోషించు గుణము
విడువడాపన్ను, లేవడి వేళ నిచ్చు
మిత్రుండీ లక్షణంబుల మెలంగుచుండు
‘‘మనం పొరపాట్లు, తప్పులు చేయకుండా, సక్రమమైన మార్గంలో నడిచేలా చూసేవాడు, మంచి పనులకు ప్రోత్సాహం అందించేవాడు, మన గురించి తనకు తెలిసిన రహస్యాలను గోప్యంగా ఉంచేవాడు, మనలోని మంచి గుణాలను ప్రశంసించి, వాటిని పెంపొందించేవాడు, మనకు కష్టాలు వచ్చినప్పుడు విడిచిపెట్టకుండా... మన వెంటే ఉండేవాడు, మనం అవసరంలో ఉన్నప్పుడు ఆదుకొనేవాడు... ఈ లక్షణాలు కలిగినవాడే మంచి స్నేహితుడు’’ అని భావం.