Toli Ekadasi: రేపు తొలి ఏకాదశి.. ఈ ఒక్కటి చేస్తే చాలని చెప్పిన పురాణాలు..
ABN , First Publish Date - 2023-06-28T19:03:16+05:30 IST
ఆషాఢ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని తెలుగు ప్రజలు తొలి ఏకాదశి పర్వదినంగా జరుపుకుంటారు. తెలుగు క్యాలెండరులో తొలి ఏకాదశి తర్వాత నుంచి పండుగలు ప్రారంభమవుతాయి.
ఆషాఢ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని తెలుగు ప్రజలు తొలి ఏకాదశి పర్వదినంగా జరుపుకుంటారు. తెలుగు క్యాలెండరులో తొలి ఏకాదశి తర్వాత నుంచి పండుగలు ప్రారంభమవుతాయి. ఈ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అలంకారాలు జరుగుతాయి. ఈ రోజు నుంచే చాతుర్మాస దీక్షలు ప్రారంభమవుతాయి.
వైకుంఠంలో మహావిష్ణువు ఈ ఏకాదశి రోజునే యోగ నిద్రలోకి వెళతారు. అందువల్ల శయన ఏకాదశిగా కూడా పిలుస్తారు. తొలి ఏకాదశి సందర్భంగా భక్తులు ఉపవాస దీక్షను ఆచరించి మరుసటి రోజు ద్వాదశి నాడు భోజనం స్వీకరిస్తారు. ఇలా చేయడం వలన సకల పాపాలు హరిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. తొలి ఏకాదశి రోజు యోగ నిద్రలోకి వెళ్లిన మహావిష్ణువు 4 నెలలు తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజున నిద్రలేస్తారు. స్వామీజీలు, పీఠాధిపతులు ఎక్కడికక్కడే చాతుర్మాస దీక్షలు ఆచరిస్తారు. తొలి ఏకాదశి ప్రత్యేకం పేలపిండి నైవేద్యం.