Subshitaum: కార్యసాధకుడు

ABN , First Publish Date - 2023-06-01T23:25:01+05:30 IST

తలపెట్టిన కార్యాన్ని సాధించాలనుకొనేవారి తీరు ఎలా ఉంటుంతో తన నీతిశతకంలో భర్తృహరి ఈ విధంగా వర్ణించాడు:

 Subshitaum: కార్యసాధకుడు

సుభాషితం

తలపెట్టిన కార్యాన్ని సాధించాలనుకొనేవారి తీరు ఎలా ఉంటుంతో తన నీతిశతకంలో భర్తృహరి ఈ విధంగా వర్ణించాడు:

క్వచి త్పృధ్వీశయ్యః క్వచి దపిచ పర్యంకశయనః

క్వచి చ్ఛాకాహారః క్వచి దపిచ శాల్యోదనరుచిః

క్వచి త్కంధాధారీ క్వచి దపిచ దివ్యాంబరధరో

మనస్వీ కార్యార్థీ న గణయతి దుఃఖం న చ సుఖమ్‌

...దాన్ని ఏనుగు లక్ష్మణకవి మనోహరంగా తెలుగువారికి అందించాడు.

ఒకచో నేలను బవ్వళించు, నొకచో నొప్పారు బూసెజ్జ పై

నొకచో శాకము లారగించు, నొకచో నుత్కృష్టశాల్యోదనం

బొకచో బొంత ధరించు, నొక్కొక్కతరిన్‌ యోగ్యాంబర శ్రేణి, లెక్కకు రానీయడు కార్య సాధకుడు దుఃఖంబున్‌ సుఖంబున్‌ మదిన్‌

భావం: అనుకున్న పని నెరవేర్చుకోవాలనుకొనే వ్యక్తి ఎలాంటి పరిస్థితులనైనా లెక్క చెయ్యడు. అవసరమైతే కటిక నేల మీద నిద్రపోతాడు. మరొకప్పుడు పూల శయ్యమీద శయనిస్తాడు. ఏదీ దొరకని రోజు కందమూలాలు తింటాడు. మరో రోజు పంచ భక్ష్య పరమాన్నాలతో... షడ్రసోపేతమైన భోజనం చేస్తాడు. లేనినాడు చింకి బొంత ధరిస్తాడు, ఉన్ననాడు ఆడంబరమైన దుస్తులు వేసుకుంటాడు. ఈ విధంగా కార్యసాధకుడు ‘ఇది సుఖం, ఇది దుఃఖం’ అనే భావన మనసులోకి రానివ్వడు. తన పని పూర్తి చేసుకోడానికి ఎలాంటి కష్టనష్టాలనైనా లెక్క చెయ్యడు.

Updated Date - 2023-06-01T23:25:01+05:30 IST