Benefits of wearing gold: దేవుడి ఉంగరాలను ఇలా పెట్టుకుంటున్నారా? అయితే మీరు..!

ABN , First Publish Date - 2023-03-28T13:47:37+05:30 IST

దేవుడి రూపులో ఉండే ఉంగరాలు, గొలుసులను ధరించగానే సరికాదు.

Benefits of wearing gold: దేవుడి ఉంగరాలను ఇలా పెట్టుకుంటున్నారా? అయితే మీరు..!
ring finger

మనలో చాలామంది ఉంగరాలను వారికి నచ్చిన విధంగా రకరకాల డిజైన్స్ లో కొందరు వారికి నచ్చిన దేవతా విగ్రహాలను బంగారు, వెండి లోహాలతో తయారు చేయించుకుని ధరిస్తూ ఉంటారు. అయితే అసలు ఈ దేవతా విగ్రహాలను చేతికి ఎటు వైపుగా ధరించాలి అనే దానిమీద సరైన అవగాహన ప్రతి ఒక్కరిలోనూ ఉండకపోవచ్చు. ఈ విషయం తెలియకుండానే చాలా పొరపాట్లు జరిగిపోతూ ఉంటాయి. అసలు ఈ విగ్రహ రూపాలున్న ఉంగరాలను ఎలా ధరించాలి.

1. జాతకరిత్యా దోషాలు ఉంటే వాటిని నివారించడానికి దోష నివారణకు కొన్ని రకాల ఉంగరాలను ప్రత్యేకంగా ధరిస్తారు. అయితే వీటిని ధరించే ముందు ఉంగరాలను పాలతో కడిగి దైవ సన్నిధిలో ధరించాలట.

2. ఇక ఆడవారు బహిష్టు సమయంలో మెడలో ధరించే ప్రతిమలు, ఉంగరాలను ముందుగానే తీసి వేయాలట.

3. దేవుడి రూపులో ఉండే ఉంగరాలు, గొలుసులను ధరించగానే సరికాదు. దానికి కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: వాస్తు ప్రకారం ఆగ్నేయ దిశ చాలా పవర్ ఫుల్.. ఇక్కడ దోషాలుంటే ఇక అంతే సంగతులట.. వెంటనే సరిచేసుకోకపోతే..!

4. దేవుడి ప్రతిమలతో ఉండే ఉంగరాలు, గొలుసులకు ఆలయాల్లో తగిన పూజలు, అభిషేకాలు చేసిన తర్వాతే ధరించాలి.

5. అలాగే కుడి చేతికి పెట్టుకున్న ఉంగరాన్ని ఎప్పుడూ కూడా ఎంగిలి అంటరాదు. అలాగే ప్రతిమలున్న ఉంగరాన్ని ఎడమ చేతికి ధరించరాదు.

6. మద్యపానం, ధూమపానం చేసేవారు ఈ దైవ ప్రతిమలున్న ఉంగారాలను ధరించకపోవడమే మంచిది. ఇక చేతికి ధరించిన ఉంగరాన్ని కళ్ళకు అద్దుకునేటప్పుడు మన చేతిని ముడుచుకుని నమస్కరించుకోవాలి. ఇలా చేస్తే శుభ ఫలితాలను అందుకోవచ్చు.

Updated Date - 2023-03-28T13:47:37+05:30 IST