bodiga chettu : విడ్డూరంగా లేదూ.. ప్రమిదలో నూనె వేస్తే చాలు., ఈ ఆకుతో దీపం పెట్టేయచ్చు..!
ABN , First Publish Date - 2023-03-22T10:33:32+05:30 IST
ఒత్తి లేకుండానే ప్రమిదలో నూనె పోసి ఆకు చివర అంటిస్తే చాలు.
ఈ బోడిగ చెట్టు ఆకుతో దీపాన్ని వెలిగించవచ్చు. అదీ ఒత్తి లేకుండానే ప్రమిదలో నూనె పోసి ఆకు చివర అంటిస్తే చాలు. అచ్చం మనం దేవుడి దగ్గర పెట్టుకునే దీపంలానే చాలాసేపు వెలుగుతూనే ఉంటుంది. దీని గురించి చాలా తక్కువ మందికే తెలిసినా ఈ చెట్టు వైద్య పరంగా కూడా చాలా సుగుణాలను కలిగి ఉంది.
అసలు ఈ ఆకు కథ ఏంటంటే.. బోడిగచెట్టు (bodiga chettu)
వెల్వెటీ బ్యూటీ బెర్రీ అనేది 5 మీటర్ల పొడవున్న పెద్ద పొద లేదా చిన్న చెట్టు. దీని బెరడు బూడిదరంగులో ఉండి, మృదువైనదిగా చిన్న నూగుతో కనిపిస్తుంది. కొమ్మలు దట్టంగా వెల్వెట్ రంగులో ఉంటాయి. ఆకులు సరళంగా, 2.5-7.5 సెంటీమీటర్ల పొడవు, దట్టంగా తెల్లటి వెల్వెట్‌గా ఉండే కాండాలపై ఉంటాయి.
ఇది కూడా చదవండి : ఉగాది పూట ఇలా చేసి లక్ష్మీదేవిని ఆహ్వానించండి..!
దీని పువ్వులు ఊదా, కొమ్మలు లేనివిగా ఉంటాయి. పండు మాత్రం ఒక గుండ్రని ఆకారంలో ఉంటుంది. దీనిలో విత్తనాలు 3-4 ఉంటాయి. వెల్వెట్ బ్యూటీ బెర్రీ ద్వీపకల్ప అనీ, భారతదేశం, శ్రీలంకలో, పశ్చిమ కనుమల అంతటా 1400 మీటర్ల వరకు సతత హరిత అడవులలో కనిపిస్తుంది.