Home Cleaning: ఎన్నిసార్లు శుభ్రం చేసినా.. ఇంట్లో ఎప్పుడూ దుమ్ము కనిపిస్తూనే ఉందా..? ఈ టెక్నిక్‌ను పాటిస్తే నెలంతా..!
ABN , First Publish Date - 2023-09-23T11:07:19+05:30 IST
సువాసన కోసం దీనికి ముఖ్యమైన నూనెను కూడా కలపండి. దీనితో అన్నీ ఒకసారి శుభ్రం చేస్తే చాలు..
మనం మామూలుగా ఏదైనా పండుగలు, ఫంక్షన్స్ అప్పుడు ఇల్లంతా శుభ్రం చేస్తూ ఉంటాం. ఇంట్లో పేరుకున్న దుమ్ము, ధూళితో పాటు చెత్తనంతా శుభ్రం చేసేస్తాం. అయితే ఇది త్వరగా మళ్ళీ దుమ్ముకొట్టుకుపోతూ ఉంటే.. ఇల్లంతా కళ లేకుండా అంద విహీనంగా ఉంటుంది. దీనిని అస్తమానూ శుభ్రం చేయాలంటే కూడా మాటలు కాదు. ఈ సమస్యకు చక్కని పరిష్కారం ఏంటంటే..
ఇంటిని ఎంత శుభ్రం చేసినా వెంటనే ఫర్నీచర్‌తోపాటు అన్ని వస్తువులపై దుమ్ము పేరుకుపోతుంది. ప్రతిరోజూ శుభ్రం చేయడానికి సమయం కేటాయించాలి. లివింగ్ రూమ్ వంటి ప్రదేశంలో దుమ్ము దులపడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎందుకంటే ఎవరు వస్తారో అనే కంగారుతో ఉండాలి. అంతేకాకుండా, ఈ దుమ్ము శ్వాసకోశ సమస్యలకు కూడా కారణమవుతుంది. దీనికి పరిష్కారం చూద్దాం.
ఇది కూడా చదవండి: గోర్లను కొరుక్కునే అలవాటుందా..? ఈ ట్రిక్స్‌ను కనుక ఫాలో అయితే నోట్లోకి చేతి వెళ్లను అస్సలు పెట్టుకోలేరు..!
దుమ్ము పోవాలంటే..
2 కప్పుల నీటిలో 1/4 కప్పు వెనిగర్, 1 టీస్పూన్ ఆలివ్ ఆయిల్, 3 చుక్కల వాషింగ్ లిక్విడ్ కలిపి సిద్ధం చేయండి. సువాసన కోసం దీనికి ముఖ్యమైన నూనెను కూడా కలపండి. దీనితో అన్నీ ఒకసారి శుభ్రం చేస్తే చాలు.. సాధారణంగా ఫర్నీచర్, అద్దం, టీవీ మొదలైన వాటిపై ఎక్కువగా దుమ్ము కనిపిస్తుంది. ఈ ద్రావణంతో వాటిపై దుమ్మును శుభ్రం చేస్తే, అది ఒక నెల పాటు శుభ్రంగా ఉంటుంది. దీనిని ఉపయోగిస్తే.. ప్రతిరోజూ డస్టింగ్ చేయవలసిన అవసరం లేదు.