Cockroaches Remedies: ఏ ఇంట్లో చూసినా ఇదే సమస్య.. రూపాయి ఖర్చు లేకుండా బొద్దింకల బెడద తప్పాలంటే..!
ABN , First Publish Date - 2023-08-23T13:26:14+05:30 IST
నిమ్మకాయ, బేకింగ్ సోడాను నీటిలో కలిపి బొద్దింకలపై కూడా చల్లవచ్చు.
చీమలు, దోమలు ఎలానో ఇల్లన్నాకా బొద్దింకలు కూడా కామనే అన్నట్టు తయారవుతున్నాయి ఇళ్ళు. ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వంటగది, బీరువాల్లో అయితే బొద్దింకలు పిల్లలతో తిరిగేస్తూ ఉంటాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే బొద్దింకలు బెడద తప్పడం లేదని బాధపడే వారికి ఈ ఇంటి చిట్కాలతో చెక్ పెట్టవచ్చు. బొద్దింకలతో ఇబ్బంది పడుతుంటే, వాటిని వదిలించుకోవాలనుకుంటే, మీరు ఇక్కడ పేర్కొన్న కొన్ని పద్ధతులను ప్రయత్నించవచ్చు. ఈ మార్గాల్లో బొద్దింకలు పారిపోతాయి. అదెలాగంటే..
బొద్దింకలను ఎలా వదిలించుకోవాలి..
బిర్యానీ ఆకు
పలావ్, బిర్యానీలలో వాడే ఆకు తెలుసుకదా, దీనితో చాలావరకూ బొద్దింకలను తరిమికొట్టవచ్చు. బిర్యానీ ఆకులు బొద్దింకలను చంపుతాయి. దీని కోసం, కొన్ని బిర్యానీ ఆకులను తీసుకొని వాటిని నీటిలో నానబెట్టండి. ఈ నీటిని బొద్దింకలపై చిలకరించడం వల్ల బొద్దింకలు పారిపోతాయి.
వంట సోడా
బేకింగ్ సోడా బొద్దింకలను వదిలించుకోవడానికి సహాయపడుతుంది. దీని కోసం, బేకింగ్ సోడాలో పంచదార కలపి మిశ్రమాన్ని సిద్ధం చేయండి. ఈ మిశ్రమాన్ని బొద్దింకలు ఉండే స్థావరాలపై వేయండి. బొద్దింకలు పారిపోతాయి.
ఇది కూడా చదవండి: ఏ టెస్టులూ చేయకుండానే.. శరీరంలో అధిక కొవ్వు ఉందని గుర్తించడం ఎలాగంటే..!
వెనిగర్
బొద్దింకలు సింక్ లోపల, బాత్రూంలో కాలువ లోపల దాక్కున్నట్లయితే, వెనిగర్ ఉపయోగించవచ్చు. వెచ్చని నీటిలో వెనిగర్ కలపండి. ఈ నీటిలో నాల్గవ వంతు వెనిగర్ తీసుకోవాలి. బొద్దింకలమీద పిచికారీ చేస్తే బొద్దింకల బెడద తగ్గుతుంది.
నిమ్మ, సోడా
నిమ్మకాయ, బేకింగ్ సోడాను నీటిలో కలిపి బొద్దింకలపై కూడా చల్లవచ్చు.
నూనెలు
బొద్దింకలపై మింట్, లావెండర్ నూనెలను చల్లవచ్చు. ఇది కాకుండా, కిచెన్ క్యాబినెట్‌లు, బొద్దింకలు ఉండే ఇతర ప్రదేశాల చుట్టూ ఈ నూనెలతో ఒక స్ట్రీక్ చేయండి. బొద్దింకలు ఇక కనిపించవు.