QR code scam : పెరుగుతున్న క్యూఆర్‌ కోడ్‌ స్కామ్స్‌

ABN , First Publish Date - 2023-08-26T00:05:52+05:30 IST

మన దేశంలో ఏదైనా ఒకటి అత్యధికంగా వినియోగంలోకి వస్తే దాని వెంటే సమస్యలూ వెన్నాడుతూ ఉంటాయి. ఎన్ని రకాలుగా మోసాలకు పాల్పడవచ్చో అన్నింటినీ స్కామర్లు సాధ్యం చేస్తుంటారు. తాజాగా క్యూఆర్‌ కోడ్‌ స్కామ్‌లు

QR code scam : పెరుగుతున్న క్యూఆర్‌ కోడ్‌ స్కామ్స్‌

మన దేశంలో ఏదైనా ఒకటి అత్యధికంగా వినియోగంలోకి వస్తే దాని వెంటే సమస్యలూ వెన్నాడుతూ ఉంటాయి. ఎన్ని రకాలుగా మోసాలకు పాల్పడవచ్చో అన్నింటినీ స్కామర్లు సాధ్యం చేస్తుంటారు. తాజాగా క్యూఆర్‌ కోడ్‌ స్కామ్‌లు పెరుగుతున్నాయి. అప్రమత్తంగా సొమ్ములు ఖాళీ అవడం ఖాయం. ఏఐ(ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌) సహాయంతో మాల్వేర్‌ జొరబాటునూ చూశాం. ఈ విషయంలో అచ్చంగా అసలైన కోడ్‌ మాదిరిగానే అనిపిస్తుంది. తద్వారా ఇన్‌స్టాల్‌ అయిన మాల్వేర్‌ - వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని సంగ్రహించి యూజర్‌ సొమ్మును కాజేస్తుంది. అయితే ఇక్కడే కొద్దిపాటి జాగ్రత్త పాటిస్తే, మోసపోకుండా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. క్యూఆర్‌ కోడ్స్‌కు సంబంధించి ఏది కరెక్ట్‌, మరేది ఫేక్‌ అన్నది తెలియకపోవడం ప్రధాన సమస్య. చాలా చోట్ల క్యూఆర్‌ కోడ్స్‌ ఇప్పుడు ఉంటున్నాయి. ఉదాహరణకు పార్కింగ్‌ ఫీజు వసూలు చేసే చోట ఉండే క్యూఆర్‌ కోడ్‌ని సెక్యూరిటీ సిబ్బంది అంతగా పట్టించుకోరు. అక్కడ స్కామర్లు తమ తెలివితేటలను ప్రదర్శిస్తారు. అదేవిధంగా వర్చువల్‌ మెనూ కార్డ్‌ను స్కాన్‌ చేసినప్పుడు అక్కడ సైబర్‌ క్రిమినల్స్‌ రియల్‌ కోడ్‌ని రీప్లేస్‌ చేయగలుగుతారు. అదేవిధంగా పే చేయాల్సిన బిల్లుల విషయంలోనూ మోసాలకు తెరలేపే అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో

  • పూర్తిగా భద్రత ఉన్న చోట్ల మాత్రమే క్యూఆర్‌ కోడ్‌ని స్కానింగ్‌ చేయాలి. అలా లేనిపక్షంలో వేరే పద్ధతుల్లో చెల్లింపులు చేయాలి. అంటే నేరుగా క్యాష్‌ కట్టేయడం వంటివి చేయాలి.

  • ఈమెయిల్‌ ద్వారా వచ్చే బిల్లుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అందుకున్న బిల్లు స్వరూప స్వభావాల్లో తేడా ఉంటే ఫోన్‌ చేసి రీ చెక్‌ చేసుకోవడం మంచిది.

  • రెండు దశల్లో అథెంటికేషన్‌ లేకుండా ఎలాంటి చెల్లింపు చేయకూడదు. కొన్ని యాప్‌లు ఒక్క టాప్‌తో పేమెంట్‌ తీసుకుంటాయి. అలాంటివి ఉపయోగించవద్దు. అలాగే ఈ వాలెట్స్‌లో ఎక్కువ సొమ్ము ఉంచొద్దు.

  • పేరొందిన యాప్‌ మార్కెట్‌ ప్రదేశాల్లోని క్యూఆర్‌ కోడ్‌ స్కానర్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మోసపూరిత కార్యకలాపాలను పట్టుకోవడమే కాదు, యూజర్లను కూడా అలెర్ట్‌ చేస్తారు.

  • సెక్యూరిటీ అప్డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాల్‌ చేసుకుంటూ ఉండాలి. అన్ని స్థాయుల్లో జరిగే స్కామ్‌ల నుంచి ఇది రక్షిస్తుంది.

Updated Date - 2023-08-26T00:05:52+05:30 IST