Saffron Eyes benefits : కుంకుమపువ్వుతో కంటికి ప్రయోజనాలెన్నో

ABN , First Publish Date - 2023-08-29T23:21:55+05:30 IST

కుంకుమ పువ్వుతో ప్రయోజనాలేమిటో చాలా మందికి తెలియదు. కుంకుమ పువ్వులో ఉండే రకరకాల పదార్థాలు- మన కంటికి ఎంతో మేలు చేస్తాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఆ మేలు ఏమిటో చూద్దాం...

Saffron Eyes benefits : కుంకుమపువ్వుతో కంటికి ప్రయోజనాలెన్నో

కుంకుమ పువ్వుతో ప్రయోజనాలేమిటో చాలా మందికి తెలియదు. కుంకుమ పువ్వులో ఉండే రకరకాల పదార్థాలు- మన కంటికి ఎంతో మేలు చేస్తాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఆ మేలు ఏమిటో చూద్దాం...

  • కుంకుమ పువ్వులో కారోటినోయిడ్స్‌ అనే పదార్థాలు ఉంటాయి. ఇవి కంటి రెటీనాకు మేలు చేస్తాయి. రోజుకు కొద్దిగా కుంకుమపువ్వు పొడిలో తేనె కలుపుకొని తాగితే- రెటీనా ఆరోగ్యం మెరుగుపడుతుంది.

  • వయస్సు మీద పడుతున్న కొలది కంటి కండరాలపై ఒత్తిడి పెరుగుతుంది. దీని వల్ల కంటి చూపు మందగిస్తుంది. కుంకుమ పువ్వు ఈ ఒత్తిడిని తగ్గిస్తుంది.

  • కొద్దిగా కుంకుమపువ్వును నీటితో కలిపి- ఆ నీటిని కళ్లల్లో వేసుకుంటే- కళ్లు శుభ్రపడతాయి. కంటి దురదలు, మంటలు వంటివి కూడా తగ్గిపోతాయి.

  • కుంకుమపువ్వును ఆహారంలో క్రమం తప్పకుండా తీసుకుంటే కేటరాక్ట్‌ల వల్ల కలిగే నష్టాలు చాలా వరకూ తగ్గుతాయి.

Updated Date - 2023-08-29T23:21:55+05:30 IST