Sai Pallavi : సీతగా సాయిపల్లవి?
ABN , First Publish Date - 2023-03-11T23:56:46+05:30 IST
కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాలంటే ఇప్పట్లో గుర్తొచ్చే మొట్టమొదటి పేరు... సాయి పల్లవి. కథ బాగుంటే చాలు... అందుకోసం ఎంత రిస్క్ తీసుకోవడానికైనా సాయిపల్లవి సిద్ధం. తన అభినయంతో ఆ పాత్రని మరో స్థాయిలో నిలబెట్టడానికి
కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాలంటే ఇప్పట్లో గుర్తొచ్చే మొట్టమొదటి పేరు... సాయి పల్లవి. కథ బాగుంటే చాలు... అందుకోసం ఎంత రిస్క్ తీసుకోవడానికైనా సాయిపల్లవి సిద్ధం. తన అభినయంతో ఆ పాత్రని మరో స్థాయిలో నిలబెట్టడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తుంది. అందుకే అమూల్యమైన పాత్రలన్నీ సాయి పల్లవిని వెదుక్కొంటూ వెళ్లిపోతున్నాయి. తాజాగా ఆమెకు సీత పాత్ర దక్కిందని టాలీవుడ్ టాక్. అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ‘రామాయణం’ని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించడానికి భారీ ఎత్తున ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఇప్పుడు ప్రధాన పాత్రల ఎంపిక జరుగుతోందని టాక్. అందులో భాగంగా సీత పాత్ర కోసం సాయిపల్లవిని సంప్రదించారని తెలుస్తోంది. సాయిపల్లవి కూడా సీతగా కనిపించడానికి ఒప్పుకొందట. దాదాపు రెండేళ్ల పాటు సాగే ప్రాజెక్ట్ ఇది. ఈ రెండేళ్లలో మరో సినిమా ఏదీ ఒప్పుకోకుండా... కాల్షీట్లన్నీ సీత పాత్రకే కేటాయించడానికి సాయి పల్లవి సిద్ధపడిందని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్లతో పాటుగా, తమిళ, కన్నడ, మలయాళ చిత్రసీమల నుంచి పాపులర్ నటీనటులు పని చేస్తారని సమాచారం అందుతోంది. మరి రాముడిగా ఎవరు కనిపిస్తారు? మిగిలిన పాత్రలు ఎవరికి దక్కబోతున్నాయి? అనేది తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి.