Shri Mahachandi Devi : నేటి అలంకరణ శ్రీ మహాచండీదేవి
ABN , First Publish Date - 2023-10-18T23:38:39+05:30 IST
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఐదో రోజున విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ మహాచండీదేవిగా దర్శనమిస్తారు. దేవతల కార్యసిద్ధి, దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం మహాలక్ష్మీ, మహాకాళీ,
ఆశ్వయుజ శుద్ధ పంచమి గురువారం
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఐదో రోజున విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ మహాచండీదేవిగా దర్శనమిస్తారు. దేవతల కార్యసిద్ధి, దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం మహాలక్ష్మీ, మహాకాళీ, మహాసరస్వతుల త్రిశక్తి స్వరూపిణిగా శ్రీమహాచండీ అమ్మవారు ఉద్భవించారు. ఆమెలో అందరు దేవతలూ కొలువై ఉన్నారు. అందుకే శ్రీమహాచండీ దేవివి ప్రార్థిస్తే సకల దేవతలను ప్రార్థించినట్టేనంటారు పెద్దలు. శ్రీమహాచండీ అనుగ్రహం వల్ల విద్య, కీర్తి, సంపదలు లభిస్తాయి. శత్రువులు మిత్రులుగా మారతారు. ఏ కోరికలతో అమ్మవారిని ప్రార్థిస్తారో ఆ కోరికలన్నీ సిద్ధిస్తాయనేది భక్తుల విశ్వాసం.
నైవేద్యం: కదంబం, చక్కెర పొంగలి, పులిహోర, లడ్డూ, రవ్వకేసరి, కట్టె పొంగలి
అలంకరించే చీర రంగు: ఎరుపు
అర్పించే పూల రంగు: ఎరుపు
పారాయణ: చండీ సప్తశతి, లలితా సహస్రనామ స్తోత్రం, శ్రీ దేవీ ఖడ్గమాల